మార్చి 11 నుంచి నిజామాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర..

by Sumithra |   ( Updated:2023-03-06 16:37:54.0  )
మార్చి 11 నుంచి నిజామాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఈ నెల 11 సాయంత్రం నిజామాబాద్ జిల్లాలోకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రవేశిస్తుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్బిన్ హుందాన్, మాజీ ఎమ్మెల్సి భూపతిరెడ్డి, నగర అధ్యక్షుడు కేశవేణు, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డిలతో కలిసి మానాల మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న రేవంత్ రెడ్డి హథ్ సే హాథ్ జోడో పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశిస్తుందని 12న పాదయాత్రకు విరామం ఉంటుందని ఆయన తెలిపారు. 13న బాల్కొండ నియోజకవర్గంలో, 14న రూరల్, 15న నిజామాబాద్ అర్బన్, 16న బోధన్, 17న ఆర్మూర్ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తారన్నారు.

12న వెయ్యిమంది రైతులతో రైతులకు నిజామాబాద్ ఉన్న సమస్యలను, రైతు కూలీలతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను రేవంత్ రెడ్డి తెలుసుకుంటారన్నారు. జిల్లాలో ఉన్న సమస్యలను ప్రజలకు తెలియజేసేవిధంగా, నియోజకవర్గాల్లో జరుగుతున్న అక్రమాలు, అరాచకాలను, దోపిడిని ప్రజలకు వివరిస్తారన్నారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, బీజేపీ ఎంపీ అర్వింద్ ఇచ్చిన హామీలు, గత 8 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజల ముందుకు తీసుకెళ్తామన్నారు.

2014 ఎన్నికలకు ముందు, 2019 ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు తీరును హాథ్ సే హాథ్ జోడో ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏవిధంగా ముందుకెళ్తామని తెలియజేసేవిధంగా పాదయాత్ర ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రేవంత్రెడ్డి పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, డిట్పల్లి మండల అధ్యక్షు కుడు అమృతపూర్ గంగాధర్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామర్తిగోపి, వేణురాజ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed