- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నామినేషన్ దాఖలు చేసిన రేవంత్ రెడ్డి
దిశ, కామారెడ్డి : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 11:30 నిమిషాలకు కామారెడ్డికి చేరుకున్న రేవంత్ రెడ్డి మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంట్లో మధ్యాహ్నం 1:00 గంట వరకు ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం షబ్బీర్ అలీ ఇంటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తల భారీ బైక్ ర్యాలీ మధ్య ఆర్డీఓ కార్యాలయం వరకు చేరుకున్నారు.
ఒంటిగంటకు మొదలైన ర్యాలీ రెండుగంటల పాటు కొనసాగగా ర్యాలీకి సమయం దగ్గర పడుతుండటంతో మధ్యలోనే ఆర్డీఓ కార్యాలయంకు రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సరిగ్గా 2:45 నిమిషాలకు నామినేషన్ వేయడానికి ఆర్డీఓ కార్యాలయంలోకి రేవంత్ రెడ్డి వెళ్లగానే వెనకాలే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. రేవంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి వెంట మాజీ మంత్రి షబ్బీర్ అలీ, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఇతర నాయకులు ఉన్నారు
నిన్న స్ట్రిక్ట్.. నేడు ఓపెన్
ఆర్వో కార్యాలయం వద్ద పోలీసుల భద్రత వైఫల్యం స్పష్టంగా కనిపించింది. నిన్న సీఎం కేసీఆర్ నామినేషన్ సందర్బంగా ఆర్వో కార్యాలయం నుంచి 100 మీటర్ల లోపు ఒక్కరిని కూడా పోలీసులు లోపలికి అనుమతించలేదు. నేడు మాత్రం అంతా ఓపెన్ గా ఉండటంతో ఎవరికి వారు ఇష్టానుసారంగా ఆర్వో కార్యాలయం వద్ద తిరగడం ప్రారంభించినా పోలీసులు పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి నామినేషన్ వేయడానికి రాగానే కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా వచ్చినా అదుపు చేయడంపై పోలీసులు దృష్టి సారించినట్టుగా కనిపించలేదు. రేవంత్ రెడ్డి ఆర్వో కార్యాలయంలోకి వెళ్లాక సీఎం సిద్ధరామయ్య వచ్చినా అదే పరిస్థితి కనిపించింది. రేవంత్ రెడ్డి, సీఎం సిద్ధరామయ్య లోపలికి వెళ్లిన తర్వాత పోలీసులు అందరినీ చెదరగొట్టారు.