దిశ కథనానికి స్పందన.. ఆలస్యమైన ఆగని పనులు..

by Sumithra |
దిశ కథనానికి స్పందన.. ఆలస్యమైన ఆగని పనులు..
X

దిశ, ఏర్గట్ల : దిశ కథనానికి స్పందన లభించింది. గత ఆగస్టు నెల 21న సమస్యల వలయంలో ఏర్గట్ల కేజీబీవీ అనే శీర్షిక కథనానికి మండల కేంద్రం గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) సభ్యులు స్పందించారు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు శివన్నోల శివకుమార్ ని కలిసి విద్యుత్ అంతరాయం పట్ల చర్చించి ఆయన ద్వారా బాల్కొండ కాంగ్రెస్ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డిని కలిసి పాఠశాలకు ఏర్పడుతున్న అధిక విద్యుత్ లోడ్ అంతరాయం గురించి వివరించారు.

విషయం తెలుసుకున్న ఆయన జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి కేజీబీవీ పాఠశాలకు కావలసిన ట్రాన్స్ఫార్మర్ ని ఏర్పాటు చేయాలని కోరగా స్పందించిన అధికారులు ఏ.డి వినోద్, ఏ.ఈ సురేష్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ గంగాధర్ బుధవారం పాఠశాల సందర్శించి పరిసరాలు పరిశీలించారు. ప్రస్తుతం పాఠశాల కొరకు తాత్కాలిక ట్రాన్స్ఫార్మర్ ని ఏర్పాటు చేసి, రెండు నెలల్లో సమస్య పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కేజీబీవీ పాఠశాలకు వసతులు కల్పించడానికి కృషి చేసిన ముత్యాల సునీల్ రెడ్డికి పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థినిలు, గ్రామ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కొరకు సహకరించిన శివన్నోళ్ళ శివకుమార్, గ్రామ కమిటీ అధ్యక్షులు కారుపాకల నర్సయ్య, క్యాషియర్ సోమలింగారెడ్డి, ఉపాధ్యక్షులు చేపూరి సుమన్, కూశ రాకేష్, వి డి సి సభ్యులను గ్రామస్తులు, యువజన సంఘాలు అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed