నత్తనడకన ఎస్సారెస్పీ గేట్ల మరమ్మతు పనులు.. నిధుల విడుదలలో సర్కార్ జాప్యం

by Shiva |   ( Updated:2024-05-20 01:31:54.0  )
నత్తనడకన ఎస్సారెస్పీ గేట్ల మరమ్మతు పనులు.. నిధుల విడుదలలో సర్కార్ జాప్యం
X

దిశ ప్రతినిధి నిజామాబాద్, బాల్కొండ: ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు నత్తతో పోటీ పడుతున్నాయి. రెండేళ్ల క్రితం ప్రారంభమైన మరమ్మతు పనులు ఇప్పటికీ పూర్తి కావడం లేదు. కానీ అంచనాలు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. గోదావరి నదిపై బాల్కొండ మండలం మెండోరా వద్ద 1963లో కట్టిన ప్రాజెక్టుకు మహారాష్ట్ర ఎగువ భాగంలో 72 వరకు చిన్న, పెద్ద ప్రాజెక్టులు కట్టడం ఈ ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కానీ, వరుణుడి కరుణతో గత ఐదేళ్లు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రాజెక్టులోకి భారీ ఇన్ ఫ్లో వస్తుండటంతో డ్యాం సేఫ్టీ కోసం వరద గేట్లు ప్రతిసారి 42 ఎత్తడం సాధ్యపడటం లేదు.

ప్రాజెక్టు నిర్మాణ సమయంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద మిగులు జలాలను విడుదల చేసేందుకు 42 గేట్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఎండాకాలం సీజన్‌లో మెయింటనెన్స్ లేదా మరమ్మతులు చేయించాలి. అయితే, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి గత నాలుగేళ్లుగా భారీగా వరద పోటెత్తుతోంది. వరద గేట్ల మరమ్మతుల కోసం సుమారు రూ.17కోట్ల నిధులను మంజూరు చేసింది. ప్రస్తుతం 27గేట్ల మరమ్మత్తులు పూర్తి కావడంతో, మిగిలిన 9 గేట్లకు మరమ్మతులు ఎప్పుడు పూర్తి చేస్తారని రైతులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు 90.313 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1,056.40 అడుగులు 10 టీఎంసీల నీటి నిల్వ వుంది. తక్కువ నీటి నిల్వ ఉండడంతో వరద గేట్ల మరమ్మతులు సులువుగా చేయవచ్చు. కానీ ఇప్పటికే జిల్లాలో వర్షాలు ప్రారంభం కావడంతో వరద గేట్ల మరమ్మత్తులు నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చివరిసారిగా 2015 ముందు మాత్రమే మరమ్మత్తులు చేశారు. ఎందుకంటే అప్పుడు ప్రాజెక్టులో డెడ్ స్టోరేజి నీటి మట్టం ఉండడంతో అది సాధ్యమైంది. 2020 జూన్ లో 30 టీఎంసీలు ఉండగా 2021 లో జూన్ 14 నాటికి 26.94 టీఎంసీల నీరు ఉంది. 2022 ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరు ఉండగా, గత సంవత్సరం 21.572 టియంసీల నీరు నీల్వ ఉంది. ప్రస్తుతం అదివారం నాడు ఎస్ఆర్ ఎస్పీ ప్రాజేక్ట్ లో 10.318 టియంసీల నీరు ఉంది. గత ఎడాది జూన్ 1 నుంచి 208.736 టియంసీల నీరు గోదావరి ద్వార ప్రాజెక్టులోకి వచ్చి చెరగా, 219 టియంసీల నీటిని దిగువకు వదిలారు.

ప్రస్తుతం ప్రాజేక్టుకు 868 క్యూసెక్కుల ఇన్ ప్లో వస్తుండగా, 481 క్యూసెక్కుల నీటిలో కోంత మీషన్ భగిరథకు వదులుతుండగా అందులో కోంత నీరు అవిరి అవుతున్నాయి. వర్షకాలంలో ప్రాజేక్టులోకి ఇన్ ప్లో లక్ష వరకు వచ్చినప్పుడే ప్రభుత్వానికి, అధికారులకు ఈ ప్రాజెక్టు గుర్తుకు వస్తుంది అనే విమర్శలు ఉన్నాయి. రఅంతే గాని ప్రస్తుతం మాధిరిగా డేడ్ స్టోరేజీకి చేరుతున్న సమయంలో యుద్ధ ప్రాతిపాధికన మరమ్మత్తులు చేయడం పై నిర్లక్ష్యం కోట్టోచ్చినట్లు కనపడుతుంది. గత పాలకులు ఇప్పటికి ఓక్క టియంసీ ఎత్తి పోయని శ్రీరాం సాగర్ పునరుజ్జీవం పథకంకు 2000 కోట్లు ఖర్చు చేసి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు గెట్ల మరమ్మత్తుకు 17 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు.

వరద గేట్ల మరమ్మత్తులు పనులు కొనసాగుతున్న బిల్లులు మంజూరు కాకపోవడమే పనులు నత్తనడకకు కారణం అంటున్నారు. గత ప్రభుత్వం నామమాత్రపు టెండర్లు, ప్రొసీడింగ్లతో పనులు ప్రారంభించడంతో పనులు ముందుకు సాగడం లేదా? కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా.మరి కొన్ని రోజులలో వర్షా కాలం ప్రారంభం అవుతుంది. కావున సకాలంలో పనులు పూర్తి చేయాలని ఎస్సారెస్పి ప్రాజెక్ట్ కు ఎలాంటి సమస్య లు తలెత్త కుండా చూడాలని కోరుతున్నారు. వరద గేట్ల మరమ్మత్తులు పూర్తి అయితే ప్రాజెక్టు లో నీరు లికేజి రూపంలో గా పోదని రైతులకు నీటికొరత ఏర్పడదని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.

2023లో ఎస్ఆర్ఎస్పి గేట్ల మొరాయింపు నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సీజన్ లో గేట్ల మరమ్మతులు చేయాలని డ్యాం సేప్టీ టీం అధికారులు సిపారసు చేశారు. 2022 లో హైదరాబాద్ కు చెందిన ఇంజినీరింగ్ సంస్థకు మరమ్మతుల కాంట్రాక్టు ఇవ్వగా అవి నత్త నడక నడుస్తున్నాయి. దానికి కాంట్రాక్ట్ సంస్థకు అనాడు ప్రభుత్వ పెద్ధలతో సంబంధాలు ఉండటమే.కనీసం ప్రాజెక్టు అధికారులు మరమ్మతులు ఏ మేరకు పూర్తి అయ్యాయి, ఇప్పటి వరకు పూర్తి అవుతాయో వెల్లడించడం లేదు. 2022 కు ముందు మరమ్మతు ప్రతిపాదనలు పెంచేందుకు పనుల నిర్వహణపై నిర్లక్ష్యం జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వం బిల్లులు మంజురు చేయడం లేదని పనులను నిలిపివేసిన కనీసం ప్రభుత్వం కు వరద గేట్ల మరమ్మతులు ప్రాధాన్యత జలవనరుల శాఖ చెప్పకపోవడం వలననే మరమ్మతులు జరుగడం లేదనే వాధనలు ఉన్నాయి. గడిచిన సీజన్ లో కడెం ప్రాజెక్టు గేట్లు మొరాయించాయి అక్కడ పనులు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాధికన జరుగుతున్నాయి. కానీ పొరుగున ఉన్న శ్రీరాంసాగర్ లో మాత్రం నిర్లక్ష్యం కొనసాగుతుంది. ఈ సీజన్ లో వానలు ముందస్థుగా కురిసితే మాత్రం మరో ఎడాదికి పనులు వాయిదా అనే చెప్పాలి.

Advertisement

Next Story

Most Viewed