అస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి

by Sridhar Babu |
అస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి
X

దిశ, బాన్సువాడ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ అస్పత్రులలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దావఖాన, మాతా శిశువు ఆస్పత్రిని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలోని వార్డులలో తిరుగుతూ రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వైద్యుల సేవలు ఎలా ఉన్నాయంటూ చికిత్స పొందుతున్న రోగులను అడిగి తెలుసుకున్నారని, చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు పలు సూచనలు చేశారు.

ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ కంట్రోలుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కొత్తగా విధుల్లో చేరిన సిబ్బందికి ఇన్ఫెక్షన్ కంట్రోల్ పై శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ కు ఆయన సూచించారు. ప్రభుత్వ మెనూ ప్రకారం రోగులకు భోజనం అందించాలని సూచించారు. శిథిలావస్థకు చేరుకున్న ఏరియా ఆసుపత్రి భవనాన్ని కూల్చి వేసి నూతన భవన నిర్మాణం చేపట్టాలని అన్నారు. అప్పటి వరకు ఏరియా ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే రోగులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు అందుబాటులో ఉన్న తాత్కాలిక భవనాన్ని సిద్ధం చేసుకోవాలని సూపరింటెండెంట్ కు సూచించారు. ఆసుపత్రిలో ప్రతి వార్డును ఆయన రోగులకు అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed