విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో గుణాత్మక విద్యను బోధించాలి

by Sridhar Babu |   ( Updated:2024-01-11 14:05:21.0  )
విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో గుణాత్మక విద్యను బోధించాలి
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలోని ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు రికార్డులను పరిశీలించి విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో ఉత్తమ గుణాత్మకమైన విద్యను బోధించాలన్నారు.

పాఠశాల తరగతి గదుల్లోనే విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని సాధ్యమైన సమస్యలను త్వరితగతంగా పూర్తి చేస్తానని పాఠశాల ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed