విద్యార్థుల పాలిట యమ గుండం

by Naresh |
విద్యార్థుల పాలిట యమ గుండం
X

దిశ, కోటగిరి: సుమారు ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర స్కూల్‌ను గత సంవత్సరం అప్పటి హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. కానీ నేడు అదే పాఠశాలకు ఆనుకొని ఉన్న పెద్ద గుంట విద్యార్థుల పాలిట యమ గుండం లాగా మారింది. ఆధునిక హంగులతో నిర్మించిన పాఠశాలలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 350 మంది విద్యార్థులకు వసతితో కూడిన విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థులు ప్లేగ్రౌండ్ బదులుగా ఆనుకొని పెద్ద గుంట నీటితో నిండి ఉండటంతో తమ పిల్లలకు ఏమైన ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన గురవుతున్నారు.

గతంలో ఆత్మహత్యలకు నిలయం....

ఇప్పుడు పాఠశాల ఏర్పాటు చేసిన స్థలంలో గతంలో పెద్ద గుంట ఉండటంతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలు పోయిన విషయం అందరికి తెలిసిందే. అదే స్థలంలో పాఠశాల నిర్మించడం కోసం అవసరమైనంత స్థలంలో గుంటను పూడ్చి పాఠశాల నిర్మించినప్పటికీ మిగిలిన గుంట పూడ్చ కపోవడంతో గుంట మొత్తం నీటితో నిండి విద్యార్థుల పాలిట యమ గుండంగా దర్శనమిస్తుంది. గతంలో కూడా నియోజకవర్గ స్థాయిలో చిన్నపాటి ఏమరుపాటుతో చిన్నారుల మరణాలు చేస్తున్నప్పటికీ అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. సుమారు 350 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలకు అనుకోని పెద్ద నీటి కుంట ఉండటం ఇటు అధికారులకు ఉపాధ్యాయులకు కనిపించడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులు కుంటను పూడ్చి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Advertisement

Next Story