- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నిరసన సెగలు.. గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. జీవన్ రెడ్డి తమ గ్రామంలో ప్రచారానికి వస్తున్నాడని తెలిసి లక్కంపల్లి గ్రామానికి చెందిన ప్రజలు జీవన్ రెడ్డి ‘గో బ్యాక్ అంటూ’ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. సోమవారం ఉదయం నుంచి జీవన్ రెడ్డి రాక కోసం ఎదురుచూసిన లక్కంపల్లి సెజ్‌లో భూములు కోల్పోయిన బాధితులు జీవన్ రెడ్డి ప్రచారానికి రాగానే ఫ్లెక్సీలు ప్రదర్శించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సెజ్‌లో భూములు కోల్పోయిన బాధితులకు వాటిని తిరిగి ఇప్పిస్తానని హామీ ఇచ్చి జీవన్ రెడ్డి మోసం చేశారని బాధితులు వాపోయారు.
పది సంవత్సరాల్లో తమ భూములు ఇప్పించకుండా కాలయాపన చేసిన జీవన్ రెడ్డి ఏ విధంగా ప్రచారానికి వస్తారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలను చించివేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు టిఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఆదివారం దొంకేశ్వర్ మండలం అన్నారం లో జీవన్ రెడ్డి ప్రచార రథాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. 24 గంటల్లోనే నందిపేట్, దొంకేశ్వర్ మండలాల్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీలకతీతంగా ప్రజలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించడం అధికార పార్టీని కలవరపాటుకు గురి చేసింది.