- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయకపోవడంపై నిరసన
దిశ, ఆర్మూర్: బీఆర్ఎస్ కంటొన్మెంట్ సిటింగ్ ఎమ్మెల్యే జి. సాయన్న అనారోగ్యానికి గురై హఠాత్తుగా మరణిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అంత్యక్రియలు అధికార లాంచనాలతో చేయకపోవడాన్ని బీజేపీ ఆర్మూర్ పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తూ..ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జివి. నరసింహారెడ్డి, దళిత మోర్చ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పులి యుగంధర్ మాట్లాడుతూ.. కేసీఆర్ దళిత ద్రోహి అని చెప్పడానికి ఇంతగా నిదర్శనం దళితులకు ఏమి కావాలని? ఎవడో నిజాం, ఎక్కడి వాడో అయినా, వ్యక్తి చనిపోతే వాడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, సినీ ప్రముఖులు చనిపోతే ప్రభుత్వ పరంగా అంత్యక్రియలు జరిపిన కేసీఆర్, 30 సంవత్సరాల రాజకీయ అనుభవం, 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రజల ఆదరణ పొంది గెలిచినటువంటి సాయన్న ,దళితులు కావడమే పాపమా? అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నించింది.
ఈ అవమానం ఒక దళిత ఎమ్మెల్యేకే కాదు అని యావత్ దళిత ప్రజానీకానిదని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ.. దీనిపై దళిత సంఘాలు సైతం స్పందించవలసిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహిఏ కాదు, దళిత ద్రోహి అని కూడా స్పష్టమైందని, దళితులకు మూడు ఎకరాలు స్థలం ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిని దళితులనే చేస్తానని చెప్పి చేయకపోవడం, నిజమైన దళితులకు దళిత బంధు కాకుండా బీఆర్ఎస్ పార్టీ వారికే దళిత బంధు ఇవ్వడం చూస్తుంటే, కేసీఆర్ పూర్తిగా దళిత ద్రోహి అని స్పష్టమవుతుందన్నారు.
వెంటనే కేసీఆర్ దళితులకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ద్యాగ ఉదయ్, మీసాల రాజేశ్వర్, విడియో విజయ్, కృష్ణ గౌడ్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, విజయానంద్, బీజేపీ ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి దుగ్గి విజయ్, ఉపాధ్యక్షులు ధోండి ప్రకాష్, దళిత మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మురళి, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు రెడ్డబోయిన మూర్తి, గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు గూగులోత్ తిరుపతి నాయక్, ఓబీసీ మోర్చ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు బాసెట్టి రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మిర్యాల్కర్ కిరణ్, బారడ్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.