పదోన్నతులు కల్పించి కొత్త రిక్రూట్మెంట్ చేపట్టాలి

by Naresh |   ( Updated:2024-02-12 14:32:09.0  )
పదోన్నతులు కల్పించి కొత్త రిక్రూట్మెంట్ చేపట్టాలి
X

దిశ, భిక్కనూరు: ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న తమకు పదోన్నతులు కల్పించి, కొత్త రిక్రూట్మెంట్ చేపట్టాలని సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాల జేఏసీ డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు భిక్కనూరు సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఉద్యోగులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలో ఉద్యోగులు పాఠశాల ఎదుట ఎండలో నిలబడి నిరసన తెలియజేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని, ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్యారిటీ స్కేల్‌ను వర్తింపజేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 137 కనుగుణంగా సమస్యకు పరిష్కారం చూపాలని, అన్ని ఆశ్రమ పాఠశాలలను ఓకే యాజమాన్య గూటికి చేర్చే విధంగా జీవోను అమలు చేయాలని, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకమైన వారికి పే స్కేల్‌తో పాటు సర్వీస్ ప్రొటెక్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

2007 లో రెగ్యులర్ అయిన ఉద్యోగులకు విధుల్లో చేరిన నాటి నుంచి వారి సర్వీసును లెక్క గట్టి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇస్తూ, ఓపీఎస్ పరిధిలోకి తేవాలన్నారు. హాలిడే డ్యూటీస్‌కు బదులు ప్రత్యామ్నాయంగా వీక్లీ ఆఫ్ ఇవ్వాలని, అన్ని డిగ్రీ కళాశాలల్లో ఏవో పోస్టు‌ను నియమించాలన్నా రు. అదేవిధంగా ఆశ్రమ కళాశాలలకు డిప్యూటీ వార్డెన్ పోస్ట్ మంజూరు చేయాలని, అన్ని గ్రూపులలోని సంస్థలకు ఒకే కాల నిర్ణయ పట్టిక, ఒకే ప్యాట్రన్ ఉండేలా అమలు చేయాలని, బీసీ, సొసైటీలలో కాల నిర్ణయ పట్టికను విద్య హక్కు చట్టం ప్రకారం మార్చాలని, అకారణమైన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.

Advertisement

Next Story

Most Viewed