- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడి బరి తెగింపు.. పండగ పూట అలా చేశాడు..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల అగడాలకు అంతు లేకుండా పోతుంది. అందరు ఉగాది పండగ వేడుకలలో ఉండగా ఓ అధికార పార్టి నాయకుడు అసైండ్ భూమి పై కన్నేశారు. తన గ్రామంలో ఒకప్పుడు దళితకులకు ఇచ్చిన (ఇనాం భూమి) అసైండ్ ల్యాండ్ చూట్టురా పెన్సింగ్ వేశారు. రెవెన్యూ అధికారులు అధికార యంత్రాంగం సెలవులలో ఉన్నప్పుడు భూమిని చదును చేసి చూట్టురా హద్దురాళ్లను పాతాడు. ఈ విషయం పై సంబంధిత గ్రామ ప్రజాప్రతినిధి ఒకరు పండగనాడు జరుగుతున్న కబ్జాభాగోతం పై అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. మరి భూ కబ్జా చేసిన అధికార పార్టి నేత పై అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ మండల కేంద్రంలో స్థానికంగా రహదారికి 50మీటర్ల దూరంలో గజానికి రూ.10,000 పలుకుతున్న ఒక్క ఎకరం భూమిలో పండగపూట బుధవారం భూమిని చదునుచేసి హద్దులు పాతారు. ఒక సర్వేనంబర్ లో ఉన్న భూమిని ఒకప్పుడు దళితులకు ఇనాంగా ఇచ్చారు. అక్కడ వారు వ్యవసాయం చేసుకుని ఫలాలను పొందారు. కాని దాని పై కన్నేసిన అధికార పార్టీ నాయకుడు 2017 నుంచి ఆ భూమిని కబ్జాకు యత్నిస్తున్నారు. అందుకు సంబంధించి రెవెన్యూ పరంగా పట్టాలను పొందే యత్నాలు చేశారు. ఇప్పటికి ధరణిలో అసైండ్ గానే వస్తుంది. అప్పుడు పనిచేసిన ఎమ్మార్వో ద్వారా సంబంధిత భూమిపై హక్కులు పొందేందుకు యత్నించడంతో దళితులు కోర్టును అశ్రయించారు. దళితలకు ఇచ్చిన భూమిలో ఇతరులు ఎలా ఉంటారని సంబంధిత భూమిని స్వాధినం చేసుకోవాలని ఉత్తర్వులు వచ్చాయి. కాని అధికార పార్టి నాయకుడు కావడంతో రెవెన్యూ అధికారులు ఆ భూమిని ఇప్పటికి స్వాధినం చేసుకోలేదు. ఇటివల మండల కేంద్రంలో అధికార పార్టి నాయకుల పై తిరుగుబాటు మొదలైంది. అసలె ఎన్నికల కోలాహలం ముందస్ధుగా వస్తాయని ఉహగానాల నేపథ్యంలో అధికార పార్టినేత ముందు జాగ్రత్తగా కబ్జాకు యత్నించారు.
బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ మండల కేంద్రంలో జరిగే అవినితి అక్రమాలపై స్థానికులు తిరగబడుతున్నారు. బుధవారం పండగపూట అధికార పార్టినేత చేపట్టిన కబ్జాకు సంబంధించిన పోటోలతో జిల్లా అధనపు కలెక్టర్ (రెవెన్యూ) కు ఫిర్యాదు చేశారు. గత ఎడాది అక్టోబర్ లో గ్రామానికి చెందిన మహిళ ప్రజాప్రతినిధి పై అధికార పార్టినేతలు దాడి చేశారు. దాని పై పోలిస్ లకు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు కేసునమోదు కాలేదు. ఇటివల ఈ విషయంలో మండల కేంద్రంలో రచ్చ రచ్చయ్యింది. ఈ నేపథ్యంలోనే సంబంధిత బీఆర్ఎస్ నాయకుడు కబ్జా వ్యవహరం వెలుగులోకి వచ్చింది. ఇటివల బాల్కొండ నియోజకవర్గంలో దళితుల భూములకు రక్షణ లేకుండా పోతుంది. ఈ నెల 19న వెల్పూర్ మండలం మోతేలో ఒక దళితుడికి సంబంధించిన ఒక ఎకరంన్నర భూమి కబ్జాకు 2000 మందితో వీడీసీ చేసిన అరాచకం జరిగిన నాలుగు రోజులకే ఈ ఘటన జరగడం దారుణం. జిల్లా అదనపు కలెక్టర్ కు గ్రామప్రజాప్రతినిధి ఫిర్యాదు చెయ్యడంతో భూమిని స్వాధినం చేసుకుంటారో లేదో వేచి చూడాలి.