- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదవులు ముఖ్యం కాదు... రైతుల క్షేమమే నా లక్ష్యం....
దిశ, కోటగిరి : తనకు పదవులు ముఖ్యం కాదని, రైతుల క్షేమమే తన లక్ష్యం అని, తాను ఉన్నా లేకున్నా రాబోయే తరాల భవిష్యత్తు కోసమే పనిచేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తాను పుట్టింది ఇక్కడే అని, తన కట్టె కాలేది ఇక్కడే అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోటగిరి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులకు పదవులు శాశ్వతం కాదని, చేసిన పనులే శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. బాన్సువాడ అభివృద్ధిలో సీఎం కేసీఆర్ సహకారం మరువలేనిదని అన్నారు. గత ఐదేళ్లలో కేసీఆర్ సహకారంతో తాను చనిపోయిన తర్వాత కూడా గుర్తుండిపోయేలా బాన్సువాడను అభివృద్ధి చేశానని చెప్పారు.
బాన్సువాడ రైతుల కోసం నిజాం సాగర్‌ను నిండు కుండలా ఉంచేందుకు మల్లన్న సాగర్ నుండి కాళేశ్వరం నీళ్లు రూ. 1500 కోట్లు ఖర్చు చేసి సొరంగం ద్వారా తీసుకొచ్చి పనులు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం కరెంటు సమస్య లేకున్నా 20 కోట్లతో కోటగిరిలో 120 కేవీ సబ్‌స్టేషన్ ను భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఏర్పాటు చేశానని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు ఇచ్చే ఉత్తుత్తి గ్యారంటీలను నమ్మొద్దని కోరారు. బీఆర్‌ఎస్ పార్టీకే ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పోచారం వెంట బాన్సువాడ నియోజకవర్గ ఇంఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ హమీద్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ సిరాజ్, సొసైటీ చైర్మన్ కూచి సిద్ధు, బర్ల గంగారాం, తేల్ల అరవింద్, బీర్కూర్ గంగారాం, బీర్కూర్ సంతోష్, బేగరి రాములు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.