కౌంటింగ్ హాల్ వద్ద మీడియాపై పోలీసుల అత్యుత్సాహం

by Sridhar Babu |
కౌంటింగ్ హాల్ వద్ద మీడియాపై పోలీసుల అత్యుత్సాహం
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి సమీపంలోని సీఎంసీ భవనంలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో విధులు నిర్వహిస్తున్న మీడియా సిబ్బందిపై ఓ పోలీసు ఉన్నతాధికారి అసహనం వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థి కౌంటింగ్ హాల్లో ఉండటంతో మీడియా పాయింట్ వద్దనే ఆయన వాయిస్ కోసం వేచి ఉన్న కెమెరామెన్లను, మీడియా సిబ్బందిని సదరు పోలీస్ అధికారి ఇక్కడ ఉండొద్దు వెళ్లిపోండి అంటూ మీడియా పై వాదనకు దిగారు. నిజానికి కెమెరామెన్లు మీడియా పాయింట్ సరిహద్దులో ఉన్నప్పటికీ ఆ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. అప్పటికే బీజేపీ కార్యకర్తలు మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నారు. వారిని వదిలి అధికారి మీడియాను అక్కడినుంచి వెళ్లమనడం కొసమెరుపు.

Next Story

Most Viewed