- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కిష్టాపూర్ లో నాలుగు బెల్ట్ షాపుల పై పోలీసుల దాడి
by Kalyani |
X
దిశ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో నాలుగు బెల్ట్ షాప్ లపై బీర్కూర్ ఎస్ ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం దాడులు నిర్వహించారు. అయినప్పటికీ ఈ సమాచారం పోలీసులు సోమవారం రాత్రి వరకు ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు దారి తీసింది. ఈ విషయం తెలిసిన వెంటనే బీర్కూర్ ఎస్ ఐ రాజశేఖర్ వివరణ కోరగా కిష్టాపూర్ లో నాలుగు బెల్ట్ షాప్ లపై దాడి చేశామని, వారి వద్ద నుంచి సుమారు 30 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఆ బెల్ట్ షాపులను నడుపుతున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో బెల్ట్ షాపులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Advertisement
Next Story