బాల్కొండ నియోజకవర్గం ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి

by Sridhar Babu |   ( Updated:2023-11-12 11:48:46.0  )
బాల్కొండ నియోజకవర్గం ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యేగా ఎవరు కావాలో పక్కాగా ఆలోచన చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడారు.యువతని మత్తులో ముంచుతున్న, గంజాయి అమ్మేటోళ్లు కావాల్నా...? యాడాదికో పార్టీ మార్చేటోళ్ళు కావాల్నా...? రాజకీయాల్లో హుందాగా ఉంటూ, పేరుకు తగ్గట్టు, అన్నం పెట్టే రైతన్నలను, ప్రజల్ని, తల్లిలా పాలించే అన్నపూర్ణమ్మ కావాల్నా? బాల్కొండ నియోజకవర్గం ప్రజలు ఆలోచించు కోవాలన్నారు. బాల్కొండ నియోజకవర్గం లోని రైతన్నలందరికీ ఎంపీ అరవింద్ నమస్కారాలు తెలిపారు. బాల్కొండ లో తాము మంత్రి ప్రశాంత్ రెడ్డి,

కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ కుమార్ రెడ్డిలను ఢీకొంటున్నమన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ ముఖ్యంగా రైతులు ఆలోచన చేసి రైతుల కోసం పనిచేసిన వారికి పట్టం కట్టి, గెలిపించాలని, రానున్న కాలంలో రైతన్నలకు ఇంకా పనులు చేస్తామన్నారు. రాష్ట్రంలో పెద్దపెద్ద వాగ్దానాలను ఎందరో చేశారని, ఇవాళ బీజేపీయే నెరవేర్చిందన్నారు. దేశంలో ఎక్కువగా అంటే 1.5 లక్షల హెక్టార్ల పసుపు సాగవుతుండగా, దాంట్లో బాల్కొండ ప్రాంతంలోనే ఎక్కువగా సాగు అవుతుందని అన్నారు. పసుపు రైతులపై

ప్రేమతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ పసుపు బోర్డును అనౌన్స్ చేశారని, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని, రానున్న రోజుల్లో మీరే చూస్తారు అన్నారు. ఈ జాతీయ పసుపు బోర్డు ద్వారా ముందు రోజుల్లో రైతులకు మద్దతు ధరతో పాటు, ఉద్యోగాలు వస్తాయని, ఇండస్ట్రీలు ఏర్పాటు అవడంతో పాటు పసుపు పంటకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. పసుపు రైతుల ఉజ్వల భవిష్యత్తు కోసం బాల్కొండలో బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత రైతన్నలు తీసుకోవాలని కోరారు. బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని రైతన్నలందరూ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మను ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు.

Advertisement

Next Story