- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్ లో పాయల్ రాజ్ పుత్, రామ్ పోతినేని సందడి
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నగరంలో కొత్తగా ఏర్పాటైన సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రముఖ తెలుగు సినీ నటుడు రామ్ పోతినేని, సినీ నటి పాయల్ రాజ్ పూత్ లు శుక్రవారం నిజామాబాద్ లో సందడి చేశారు.
సీఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం మావూరి వెంకట రమణ సారథ్యంలో తన వ్యాపార సామ్రాజ్య విస్తరణలో భాగంగా 35వ బ్రాంచిని నిజామాబాద్ లో శుక్రవారం ప్రారంభించింది. అట్టహాసంగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి యాజమాన్యం ఏర్పాట్లు ఘనంగా చేసింది. కొద్ది రోజుల ముందు నుంచే జిల్లా వ్యాప్తంగా తన సిబ్బందితో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం గురించి గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతాల్లో ముమ్మర ప్రచారం నిర్వహించింది. సెప్టెంబర్ 27 న శుక్రవారం సీఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉందన్న సమాచారం అందరి నోళ్లలో నానేలా ప్రచారం నిర్వహించడంలో యాజమాన్యం సక్సెస్ అయ్యింది.
ఫలితంగా ఉదయం నుంచే జిల్లా నలుమూలల నుంచి సినీ హీరో రామ్ పోతినేని అభిమానులు, నటి పాయల్ రాజ్ పూత్ అభిమానులు పెద్దయెత్తున నిజామాబాద్ నగరానికి తరలి వచ్చారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉన్నప్పటికీ సెలబ్రెటీలు కొంత ఆలస్యంగా వచ్చారు. అయినప్పటికీ అభిమానులు వారి కోసం ఓపిగ్గా ఎదురుచూశారు. హీరో రామ్ పోతినేని, హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ లు అభిమానులను పలకరించి ఉర్రూతలూగించారు.
అరుపులు, కేరింతలతో అభిమానులు రామ్నిజామాబాద్ లో పాయల్ రాజ్ పుత్, రామ్ పోతినేని సందడి, పాయల్ లకు స్వాగతం పలికారు. తమ అభిమాన నటీ,నటులను దగ్గరగా చూసేందుకు, వారితో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు జనం ఎగబడ్డారు. దీంతో కొంత తోపులాట జరిగింది. అనంతరం రామ్ పోతినేని, పాయల్ రాజ్ పూత్ లు షాపింగ్ మాల్ లోని అన్ని విభాగాలను సందర్శించారు. నిజామాబాద్ వంటి అభివృద్ధి చెందిన నగరంలో ఇలాంటి షాపింగ్ మాల్ నగరవాసులకే కాదు, జిల్లా నలుమూలల ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సీఎంఆర్ షాపింగ్ నమ్మకానికి అమ్మవంటిదని, ఇక్కడ అన్ని రకాల నాణ్యమైన, మన్నికైన వస్త్రాలు సరసమైన ధరల్లో లభిస్తాయని పాయల్ రాజ్ పూత్, రామ్ పోతినేనిలు అన్నారు. అంతకు ముందు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, నగర్ మేయర్ నీతూ కిరణ్ లు కూడా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. వివిధ విభాగాలను వారు ప్రారంభించారు.