పాఠశాలలో వసతులు సరిగా లేవని తల్లిదండ్రుల రాస్తారోకో

by Sridhar Babu |
పాఠశాలలో వసతులు సరిగా లేవని తల్లిదండ్రుల రాస్తారోకో
X

దిశ, భిక్కనూరు : పాఠశాలలో వసతులు సరిగా లేవని, వెంటనే మరో బిల్డింగ్ లోకి షిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన సంఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... మండల కేంద్రంలోని జ్యోతిరావు పూలే బాలుర పాఠశాల ఇరుకైన అద్దె భవనంలో కొనసాగుతుందని, పాఠశాలలో 400 మంది విద్యార్థులు ఉండగా 20 బాత్రూంలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. వాటికి తలుపులు కూడా ఎక్కించడం లేదన్నారు. లగేజ్ పెట్టుకోవడానికి స్థలం లేక, ఆడుకునేందుకు క్రీడ మైదానం లేక అన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వసతులు సరిగా లేకపోవడంతో సెలవు దినాలకు ఇంటికి వచ్చిన పిల్లలు మళ్లీ పాఠశాలకు వెళ్లేందుకు భయపడిపోతున్నారని, చర్మ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాఠశాల బిల్డింగ్ ను మరో బిల్డింగ్ లోకి షిఫ్ట్ చేయాలని విజ్ఞప్తులు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. సమస్యల గురించి ప్రిన్సిపాల్ ను ప్రశ్నిస్తే తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. సుమారు 20 నిమిషాల పాటు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేయడంతో రోడ్డుకిరువైపులా

వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆందోళనకు దిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఏదైనా సమస్య ఉంటే వినతి పత్రం రూపంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి తప్ప ఆందోళనకు దిగడం మంచిది కాదన్నారు. ఆ తర్వాత పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed