sex racket: అడ్డాలను ఎత్తేసిన సెక్స్ రాకెట్ నిర్వాహకులు.. మరింత గోప్యంగా దందా..?

by Mahesh |
sex racket: అడ్డాలను ఎత్తేసిన సెక్స్ రాకెట్ నిర్వాహకులు.. మరింత గోప్యంగా దందా..?
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి సెక్స్ రాకెట్ నిర్వహణపై దిశ పత్రికలో వరుసగా అయిదు రోజుల పాటు వచ్చిన కథనాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. దిశ కథనాలపై పోలీసు శాఖ అప్రమత్తమైనా విచారణ ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. మరోవైపు సెక్స్ రాకెట్ నిర్వహకుల్లో ఆందోళన మొదలైనట్టుగా ప్రచారం సాగుతోంది. గుట్టుగా సాగుతున్న దందాను దగ్గరుండి చూసినట్టుగా కథనాలు వస్తుండటంతో అసలు ఏం జరుగుతోంది అని తెలుసుకునే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది. కొద్దిరోజుల పాటు ఈ దందాను తాత్కాలికంగా పక్కన పెట్టి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.

సెక్స్ అడ్డాల షిఫ్టింగ్..?

కామారెడ్డి జిల్లా కేంద్రంలో సెక్స్ రాకెట్ నిర్వహణకు సంబంధించిన సంచలన విషయాలను దిశ పత్రిక వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. పత్రికలో వచ్చిన కథనాలతో అప్రమత్తమైన నిర్వాహకులు కొత్త దారిలో దందా చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకుని దందా సాగించిన నిర్వాహకులు ప్రస్తుతం ఆ అడ్డాలను ఎత్తేసినట్టుగా తెలుస్తోంది. గతంలో కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో కొన్ని లాడ్జి లో సాగిన ఈ దందాను ప్రస్తుతం ఇళ్లలోకి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం వరకు కూడా లాడ్జీలలో ఈ దందా సాగిన దిశ పత్రికలో వస్తున్న వార్తలతో పోలీసు శాఖ అప్రమత్తం కావడంతో వాటిని క్లోజ్ చేశారన్న ప్రచారం సాగుతోంది. అయితే విటులకు నేరుగా ఇళ్ల వద్దకే అమ్మాయిలను సరఫరా చేస్తున్నారని తెలుస్తోంది. దాంతో ఇళ్ల వద్ద అంత సేఫ్ కాదని కొందరు దూరంగా ఉంటున్నట్టుగా ప్రచారం సాగుతోంది

గోప్యంగా సిటీ అమ్మాయిల వివరాలు

హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుంచి కామారెడ్డి కి ప్రత్యేకంగా వస్తున్న అమ్మాయిల వివరాలను గోప్యంగా ఉంచుతున్నారన్న ప్రచారం సాగుతోంది. విటుల వద్దకు అమ్మాయిలను పంపే ముందు వివరాలు ఏమి చెప్పవద్దని వారిని ముందే హెచ్చరించి పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే వెళ్లేముందు అమ్మాయిల వద్ద ఫోన్లు కూడా ఉండకుండా జాగ్రత్త పడటంతో పాటు వాళ్ళ ఫోన్ నంబర్లు విటులకు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయినా కొందరు విటులు అమ్మాయిలను మచ్చిక చేసుకుని పర్సనల్ ఫోన్ నంబర్లు తీసుకుని నేరుగా టచ్ లోకి వెళ్తున్నట్టు గా ప్రచారం సాగుతోంది. ఫలితంగా నిర్వాహకుల ద్వారా కాకుండా నేరుగా అమ్మాయిలతో మాట్లాడుకుని వీకెండ్ లో హైదరాబాదుకు వెళ్లి గడిపి వస్తున్నట్టుగా తెలుస్తోంది.

తలనొప్పిగా మారిన విచారణ

సెక్స్ రాకెట్ నిర్వహణ పేరుతో సంచలన విషయాలను దిశ పత్రిక వెలుగులోకి తేవడంతో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయింది. జిల్లా ఎడిషన్లో కాకుండా మెయిన్ లో కథనాలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కామారెడ్డి సెక్స్ రాకెట్ అంశం చర్చనీయాంశంగా మారినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సీసీఎస్, ఇంటెలిజెన్స్, పోలీసు వర్గాలు బృందాలుగా విడిపోయి ముమ్మరంగా విచారణ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అయితే నిర్వాహకులు అడ్డాలను మార్చడంతో ఎక్కడ విచారణ మొదలు పెట్టాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సెక్స్ రాకెట్ అంశంలో విచారణ పోలీసులకు తలనొప్పిగా మారినట్టుగా తెలుస్తోంది.

ప్రజల నుంచి విమర్శలు

మరోవైపు కామారెడ్డిలో జరుగుతున్న సెక్స్ దందాపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మాయిల సరఫరాపై పోస్టర్లు అతికించిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నా అతను చెప్పిన సమాచారంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు పట్టుబడిన వ్యక్తి కావాలనే పోలీసులను తప్పుదోవ పట్టించి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు రెండు రోజుల క్రితం కామారెడ్డి రైల్వే స్టేషన్ లో మద్యం తాగించిన అమ్మాయిని వదిలి పెట్టి పారిపోయిన వారిని పోలీసులు ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి.

Advertisement

Next Story