- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర బడ్జెట్‌లో పసుపు రైతులకు వంద కోట్లు కేటాయించాలి: నరసింహ నాయుడు
దిశ, నిజామాబాద్ సిటీ: రెండు సంవత్సరాల క్రితం ఆనాడు బంగ్లాదేశ్ కు ఎక్స్ ఫోర్ట్ చేయడం వల్లనే తన ద్వారా ధర వచ్చిందని గొప్పలు చెప్పి, ప్రకటనలు ఇచ్చిన ఎంపీ అరవింద్ ఇప్పుడు 4 వేలు, 5 వేలు ధర పలుకుతుందని ఎక్స్ పోర్ట్ చేయడానికి వ్యాన్లు, లారీలు దొరకడం లేదా అన్నారు. శనివారం నిజామాబాద్ మార్కెట్ యార్డ్ ను రాష్ట్ర అధ్యక్షడు కోటపాటి నరసింహ నాయుడు, జిల్లా అధ్యక్షుడు పత్కురి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ లో పసుపు రైతులతో సందర్శన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గొప్పలు చెప్పుకునే ఎంపీ అరవింద్ కేంద్రంతో మాట్లాడి 10 వేల మద్దతు ధర వచ్చేలా చూడాలన్నారు. వెంటనే కేంద్ర బడ్జెట్ లో వంద కోట్లు కేటాయించి పసుపు బోర్డ్ తేవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో ఎంపీ రాజీనామా చేయాలన్నారు.
పసుపు సంఘం నాయకుడు, యువ రైతు
రైతు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ అరవింద్ పసుపు బోర్డ్ అని చెప్పి మోసం చేశారని రాబోవు రోజుల్లో రైతులు చెప్పుల దండలు మెడలో వేస్తారని, పసుపు బోర్డ్ తెస్తానని అభిషేకాలు చేయించుకున్న అరవింద్ ఇకపై గ్రామాల్లో తిరగనీయ్యమని కేంద్రం తో కోట్లాది రైతుల పక్షాన నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో నక్కల చిన్నారెడ్డి పసుపు రైతులు పాల్గొన్నారు.