- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్న కొడుకులు కాదంటున్నారయ్యా... మాకు మీరే దిక్కు ..
దిశ, నిజామాబాద్ సిటీ : జన్మనిచ్చిన మాకు బుక్కెడు బువ్వ పెట్టి, మా ఆలన చూసుకోవాలని వృద్ధ దంపతులు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. పూర్తి వివరాల్లోకివెళితే నిజామాబాద్ నగరంలోని నర్శగౌడ్ వీధికి చెందిన న్యామ తాబాద్ గంగాజి, లక్ష్మీబాయి అనే వృద్ధ దంపతులు ఉన్నారు. వారికొడుకు వారికి బుక్కెడు బువ్వపెట్టి వారి ఆలనా పాలన చూసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.
సోమవారం వృద్ధ దంపతులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి మాట్లాడుతూ నాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని ప్రస్తుతం ఉన్న మడిగెల నుంచి వచ్చే అద్దె డబ్బులతోనే వారి జీవనం కొనసాగుతుందని తెలిపారు. మడిగే కిరాయి కూడా ఇవ్వాలని వారి కొడుకులు వేధిస్తున్నారని అన్నారు. ఈ వయసులో వంట చేసుకుని తినడానికి కూడా ఆరోగ్యం సహకరిస్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి కలెక్టర్ సారు స్పందించి మాకు న్యాయం చేయాలని వృద్ధ దంపతులు కోరారు.