అధికారులు అప్రమత్తంగా ఉండండిః ఎంపీ అరవింద్

by Nagam Mallesh |
అధికారులు అప్రమత్తంగా ఉండండిః ఎంపీ అరవింద్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ః జిల్లాలో రెండు మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే రోడ్లు తెగిపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతోందని ఎంపీ అరవింద్అన్నారు. మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ ఆర్ అండ్ బి, పోలీస్, విద్యుత్, ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి నిజామాబాద్, జగిత్యాల జిల్లాల కలెక్టర్లను కోరారు. ఈ మేరకు ఆయన రెండు జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని అర్వింద్ కలెక్టర్లకు రాసిన లేఖలో కోరారు కోరారు. అదేవిధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా 40 గేట్లు తెరిచినందున మత్స్యకారులు, జాలర్లను అప్రమత్తం చేయాలని, నిరాశ్రయులైన లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి కనీస సౌకర్యాలు అందజేయాలని కోరారు. మరోవైపు ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయట తిరగవద్దని ఆయన కోరారు. వ్యవసాయ మోటర్ల వద్ద రైతులు జాగ్రత్తగా ఉండాలని, గోదావరి పరివాహక గ్రామాల మత్సకారులు, జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే భారతీయ జనతా పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి పార్టీ శ్రేణులకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed