ఎన్నికల చట్టాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలి : జిల్లా కలెక్టర్

by Aamani |
ఎన్నికల చట్టాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలి : జిల్లా కలెక్టర్
X

దిశ, కామరెడ్డి : ఎన్నికల చట్టాలు, నిబంధనలపై ఎన్నికల అధికారులు పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం మాస్టర్ ట్రైన్లర్లకు శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణకు కలెక్టర్ హాజరై మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు స్వేచ్ఛగాను, నిష్పక్షపాతంగా జరిగే విధంగా ప్రిసైడింగ్ అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని తెలిపారు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను తమ నియోజకవర్గంలో నుంచి తప్పనిసరిగా పొందాలని సూచించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందించే విధంగా ఫారం 12 లను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది సమర్పించిన ఆప్షన్ లో ప్రకారం తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు.

అసెంబ్లీ నియోజకవర్గాల్లో మే 4 నుంచి మే 8 వరకు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు స్వీకరిస్తారని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి సంబంధించి వివరాలను 11 సీ లో పొందుపరచాలని చెప్పారు. ఫారం 12 పోస్టల్ బ్యాలెట్ అందనివారు సంబంధిత ఏఆర్ఓ కు సమాచారం తెలియజేయాలని సూచించారు. ఉద్యోగి ఓటు ఎక్కడ ఉంటే అక్కడే ఓటు వేసుకుని తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ స్టేషన్ లో ఏర్పాటు, మాకు పోల్ నిర్వహించడం, ఈవీఎం, వివి ప్యాట్ , డ్రాఫ్ట్ బాక్స్ నుంచి మాక్ పోల్ స్లిప్పులను తీసివేయడం, వివి ప్యాడ్ మాప్ కోల్ పింక్ పేపర్ స్లిప్పులను వెనుక వైపు స్టాంపు చేసిన తర్వాత నలుపు కవర్లో సీల్ చేసే విధానం పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. శిక్షణలో మాస్టర్ ట్రైనరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story