Officials check : ఆర్మూర్ లో పలు హోటళ్లపై అధికారుల తనిఖీలు..

by Kalyani |
Officials check : ఆర్మూర్ లో పలు హోటళ్లపై అధికారుల తనిఖీలు..
X

దిశ ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, కమిషనర్ రాజుల ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని పలు హోటల్స్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటళ్ల తనిఖీలలో భాగంగా వంటగదిలో పరిశుభ్రంగా లేని కావ్య మెస్, త్రిశక్తి బార్ అండ్ రెస్టారెంట్ హోటల్ నిర్వాహకులకు రూ. 10,000 రూపాయల జరిమానాలను విధించారు. ఈ తనిఖీలలో సానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, మున్సిపల్ సిబ్బంది వెంకటేష్, బాబురావు, రవి తదితరులు పాల్గొన్నారు.

Next Story