- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణకు కేంద్రం వరద సాయం..ప్రధాని మోడీ, అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపిన కిషన్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: వర్షాకాలం సమయంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో వరదలు సంభవించాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగింది. దీంతో కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. వరద కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి వరద ప్రభావిత ప్రాంతాల సమాచారాన్ని తీసుకున్నాయి. అనంతరం వరదల కారణంగా నష్టం జరిగిన 14 రాష్ట్రాలకు (ఈ రోజు అక్టోబర్ 2 మంగళవారం సాయంత్ర) కేంద్రం వరద సాయం నిధులు విడుదల చేసింది. మొత్తం రూ.5,858 కోట్లు విడుదల కాగా.. ఇందులో ఏపీకి రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416.80 కోట్లు విడుదల చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన రాష్ట్రాలకు వారి తిరుగులేని మద్దతుగా నిలవడం కోసం తెలంగాణ రాష్ట్రానికి ₹416.80 కోట్లు విడుదల చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా లకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా.. 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు సకాలంలో నిధులు విడుదల చేయడం వల్ల పునరావాస ప్రయత్నాలను వేగవంతం చేయడంతో పాటు అవసరమైన సామగ్రి బాధిత వర్గాలకు వేగంగా చేరేలా చూస్తుందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తన ట్వీట్ లో రాసుకొచ్చారు.