CBIC : ఆ ప్రయాణికుల డేటా ఇవ్వడం తప్పనిసరి.. ఎయిర్ లైన్స్‌కు సీబీఐసీ ఆదేశాలు

by Sathputhe Rajesh |   ( Updated:2024-12-30 16:55:39.0  )
CBIC : ఆ ప్రయాణికుల డేటా ఇవ్వడం తప్పనిసరి.. ఎయిర్ లైన్స్‌కు సీబీఐసీ ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : విదేశీ ప్రయాణికుల వివరాలను ఎయిర్ లైన్స్ సంస్థలు కస్టమ్స్ అధికారులకు తప్పనిసరిగా ఇవ్వాలని సీబీఐసీ(సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్) సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు వచ్చే ఏడాది ఎప్రిల్ 1ని గడువుగా విధించింది. నిబంధనలను అతిక్రమిస్తే జరిమానాలు విధిస్తామని తేల్చి చెప్పింది. ‘ప్యాసెంజర్ నేమ్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్స్- 2022’ ప్రకారం విదేశీ ప్రయాణికుల వివరాలను ప్రయాణానికి 24 గంటల ముందు కస్టమ్స్ అధికారులకు అందించాలని స్పష్టం చేసింది. ప్రయాణికుల మొబైల్ నెంబర్, పేమెంట్ మోడ్‌, బిల్లింగ్(క్రెడిట్ కార్డు నెంబర్) టికెట్ జారీ అయిన తేదీ, ఒకే పీఎన్ఆర్‌‌పై ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికుల వివరాలను పొందుపర్చాలని సూచించింది. వీటితో పాటు ఈ-మెయిల్ ఐడీ, ట్రావెల్ ఏజెన్సీ వివరాలు, బ్యాగేజీ సమాచారాన్ని తెలపాలని ఆదేశించింది. డేటా సమర్పించడంలో ఆలసత్వం వహిస్తే రూ.25వేల నుంచి రూ.50వేల వరకు ఫైన్ విధించనున్నట్లు తాజా ఆదేశాల్లో పేర్కొంది.


Read More..

LG Saxena: అతిశీని తాత్కాలిక సీఎంగా అభివర్ణించడం బాధాకరం.. ఎల్జీ వీకే సక్సేనా

Advertisement

Next Story

Most Viewed