- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. వేతనం ఎంతంటే..
దిశ, వెబ్‌డెస్క్ : గ్రాడ్యూయేషన్ పూర్తిచేసి బ్యాంక్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా. ఈ శుభవార్త మీ కోసమే. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యాకల్టీ, ఇతర పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి రుసుము అవసరం లేదు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, centralbankofindia.co.in ని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 10 అక్టోబర్ 2024.
పోస్టుల వివరాలు..
ఫ్యాకల్టీ
ఆఫీస్ అసిస్టెంట్
సెక్యూరిటీ అండ్ గార్డెనర్
విద్యార్హత..
ఫ్యాకల్టీ - ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.
ఆఫీస్ అసిస్టెంట్ - ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. అకౌంటింగ్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
సెక్యూరిటీ అండ్ గార్డెనర్ - ఈ పోస్టులకు దరకాస్తు చేసుకునే అభ్యర్థి 7వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి..
అభ్యర్థుల వయస్సు 22 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ..
రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ విషయంలో సొసైటీ/ట్రస్ట్ నిర్ణయమే అంతిమంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలన్నీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయని అభ్యర్థులు గమనించాలి. ఎంపికైన అభ్యర్థులను ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తారు. ఈ పోస్టులలో ఉత్తీర్ణులైన వారు బీహార్‌లోని తూర్పు, పశ్చిమ చంపారన్‌లో ఉద్యోగం చేయవలసి ఉంటుంది.
వేతనం వివరాలు..
ఫ్యాకల్టీ - ఈ పోస్టుకు నెలవారి వేతనం రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు ఇవ్వనున్నారు. పర్ఫామెన్స్ ని బట్టి ఉద్యోగి ఒప్పందాన్ని కూడా పొడిగించవచ్చు.
ఆఫీస్ అసిస్టెంట్ - ఈ పోస్టుకు నెలవారి వేతనం రూ. 20,000 నుంచి రూ. 27,500 ఇవ్వనున్నారు.
సెక్యూరిటీ అండ్ గార్డెనర్ - ఈ పోస్టుకు నెలవారి వేతనం రూ.12 వేల నుంచి రూ.16 వేలు ఇవ్వనున్నారు.