- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gujarat woman: ప్రియుడితో సెక్స్ చేస్తుండగా రక్తస్రావం.. గుజరాత్‌లో యువతి మృతి
దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ యువతి తన ప్రియుడితో శృంగారంలో పాల్గొన్న కాసేపటికే తీవ్ర రక్తస్రావమై మరణించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఓ యువతి(23) తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి నవ్‌సారిలోని ఓ హోటల్ కు వెళ్లింది. అనంతరం ఇద్దరూ సెక్స్‌లో పాల్గొంటుండగా యువతి ప్రయివేట్ పార్ట్స్ నుంచి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో యువతి ప్రియుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా రక్తం ఆగలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లకుండా దాదాపు 90 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలు చూస్తూ సొంత వైద్యం చేసేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలోనే చాలా రక్తం పోవడంతో యువతి స్పృహ కోల్పోయింది. అనంతరం మరో స్నేహితుడితో కలిసి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే యువతి మరణించినట్టు వైద్యులు తెలిపారు. సెక్స్ చేస్తుండగా యువతి ప్రయివేట్ పార్ట్స్‌లో తీవ్రమైన గాయం కావడం వల్ల రక్తస్రావం జరిగిందని, ఇదే ఆమె మరణానికి దారితీసిందని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. ఈ నిర్లక్ష్యానికి కారణమైన యువతి ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు చేయనున్నట్టు వెల్లడించారు. అయితే యువతికి వెంటనే వైద్య సహాయం అందితే బతికేదని డాక్టర్లు తెలిపారు.