జపాన్, జర్మనీలలో నర్సింగ్ ఉద్యోగ అవకాశాలు

by Sridhar Babu |
జపాన్, జర్మనీలలో నర్సింగ్ ఉద్యోగ అవకాశాలు
X

దిశ, నిజామాబాద్ సిటీ : తెలంగాణ ప్రభుత్వం, కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ కింద రిజిస్టర్డ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ అయిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) జపాన్, జర్మనీలలో నర్సింగ్ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 22 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల బీఎస్సీ నర్సింగ్ డిప్లొమా హోల్డర్లు జపాన్‌లో నర్సింగ్ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, విజయవంతంగా స్థానం పొందిన అభ్యర్థులు నెలకు 1.5-1.8 లక్షలు పొందుతారు.

జర్మనీలో నర్సింగ్ అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రామ్ కోసం 18 నుంచి 28 సంవత్సరాల వయస్సులో ఇంటర్మీడియట్‌లో 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జర్మనీలో అభ్యర్థులు శిక్షణ సమయంలో నెలకు లక్ష స్టైపెండ్, ఉద్యోగ నియామకం తర్వాత నెలకు 3 లక్షల జీతం పొందుతారు. జపనీస్, జర్మన్ భాషలపై రెసిడెన్షియల్ శిక్షణ, అవసరమైన అదనపు వృత్తిపరమైన నైపుణ్యాలు ఎంపికైన అభ్యర్థులకు తరువాత హైదరాబాద్‌లో అందిస్తారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ రెజ్యూమ్‌లను [email protected]కు మెయిల్ చేయవచ్చు. లేదా 8919047600/9573945684/6302292450ని సంప్రదించవచ్చన్నారు.

Advertisement

Next Story