వాహనాలకు నెంబర్ ప్లేట్లు తప్పనిసరి : ఎస్ఐ మహేష్

by Kalyani |
వాహనాలకు నెంబర్ ప్లేట్లు తప్పనిసరి :  ఎస్ఐ మహేష్
X

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఐదు ద్విచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు. వాహనదారులు ఎవరైనా తమ వాహనాలకు తప్పకుండా నంబర్ ప్లేట్లు ఉండాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డి ఎస్ఐ వాహనదారులకు హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి పోలీస్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

Advertisement

Next Story