- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ఉన్న ఆగని అక్రమ రవాణా
దిశ, కోటగిరి: ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ పోతంగల్ మండల కేంద్రంలోని మంజీరా బ్రిడ్జి వద్ద అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల ఏర్పాటు చేసిన కూడా అక్రమ ఇసుక రవాణాను అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. రాత్రి సమయాల్లో చెక్‌పోస్ట్ ఉన్నప్పటికి అక్రమ ఇసుక రవాణా ఆగకపోవడంతో ప్రత్యక్షంగానే అధికారుల పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో ముమ్మర తనిఖీల్లో నగదు మద్యం పట్టుబడుతున్న విషయం తెలిసింది. కానీ పొతంగల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ద్వారా భారీగా నగదు మద్యం చేతులు మారే ఆస్కారం ఉన్నప్పటికీ చెక్ పోస్ట్ అధికారులు తనిఖీలు నిర్వహించకుండా అక్రమ ఇసుక రవాణా దారులకు అండగా నిలుస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా చాటున మద్యం, డబ్బులు తరలించే అవకాశం ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం మాఫియా కోసం పనిచేయడం పై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నామమాత్రంగా ఉన్నటువంటి చెక్‌పోస్టు పకడ్బందీగా నిర్వహించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.