100 ఏండ్ల చరిత్రగలది నిజాంసాగర్ ప్రాజెక్టు.. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

by Sumithra |
100 ఏండ్ల చరిత్రగలది నిజాంసాగర్ ప్రాజెక్టు.. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, నిజాంసాగర్ : ఉమ్మడి జిల్లాల వరప్రదాయనిగా నిజాంసాగర్ ప్రాజెక్టుకు 100 సంవత్సరాల చరిత్ర కలదని బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజాం సాగర్ ప్రాజెక్టును సందర్శించిన ఆయన మాట్లాడుతూ గడిచిన 40 సంవత్సరాలుగా గమనిస్తుంటే ప్రతి సంవత్సరం నిజాంసాగర్ నీటిని ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసిన తర్వాతే నిజాంసాగర్ ప్రాజెక్టులోకి జలకలను సంతరించుకుంటుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు 5 ప్రధాన వరద గేట్లను ఎత్తి వర్ధనీటిని మంజీరా నదిలోకి విడుదల చేసిన తరుణంలో పర్యాటకుల తాకిడి పెరుగుతుందని అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ ఈఈ సోలోమాన్ ను ఆదేశించారు. 1972 లో ప్రాజెక్టులో మట్టి రావడంతో 12 టీఎంసీల మేరకు నీటి నిల్వలు తగ్గిపోయాయని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద అలీ సాగర్ వరకు 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందన్నారు.

వానాకాలం పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నీరు ఆయకట్టు రైతుల పంటల కోసం జుక్కల్ నియోజకవర్గంలో 7 వేలు, బాన్సువాడ నియోజకవర్గంలో 95 వేలు,బోధన్ నియోజకవర్గంలో 25 వేల ఎకరాలకు సాగు అవుతున్నట్లు ఆయన అన్నారు. ఆయకట్టు రైతులు నిజాంసాగర్ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని వానాకాలం పంటల సాగు అనంతరం ప్రాజెక్టులో ఉన్న నీటి నిలువలో యాసంగి పంటలను సాగు చేసుకున్నారు. నీటి వినియోగం పై అధికారులు రైతన్నలకు తగు సూచనలు సలహాలు అందిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రాజెక్టు నీటి విడుదలను తిలకించేందుకు పర్యాటకులకు అనుమతి ఇవ్వడం లేదని పలువురు పర్యాటకులు ఆయన దృష్టికి తీసుకురాగా వెంటనే జిల్లా ఎస్పీ అధికారులతో మాట్లాడారు. ప్రాజెక్టును తిలకించేందుకు పర్యాటకులకు అనుమతి ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ ఈఈ సోలోమాన్, మాజీ జెడ్పీటీసీ చీకోటి జయ ప్రదీప్, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, గాండ్ల రమేష్, రాము రాథోడ్, జలాల్ పూర్ రాజు గౌడ్, ఏరువాల కృష్ణారెడ్డి, ఎజాస్ శ్రీధర్, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed