Nizam Sagar : నిజాంసాగర్‌ ప్రాజెక్టు 4 గేట్ల ఎత్తి వేత

by Sridhar Babu |   ( Updated:2023-07-27 15:06:44.0  )
Nizam Sagar : నిజాంసాగర్‌ ప్రాజెక్టు 4 గేట్ల ఎత్తి వేత
X

దిశ,నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా గురువారం కురిసిన భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్‌, ఏఈ సోలోమాన్‌, ఏఈ శివప్రసాద్‌లు బాన్సువాడ ఆర్డీఓ భుజంగరావ్‌ ఆధ్వర్యంలో నిజాంసాగర్‌ ప్రాజెక్టు 6,7,2,10 నెంబర్‌ వరదగేట్లను ఎత్తివేసి వరద గేట్ల ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని మాంజీరాలోకి వదిలారు.

నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు. ఇది 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1403.42 అడుగుల నీరు ఉంది. 15.557 టీఎంసీలకు సమానం. ఎగువ ప్రాంతం నుండి 38.500 క్యూసెక్కుల వరదనీరు పసుపేరు, పోచారం ప్రాజెక్టుల నుండి వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు సీఈ శ్రీనివాస్‌ వెల్లడించారు. నీటి విడుదల కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీఓ భుజంగరావ్‌, నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఏఈ సోలోమాన్‌, ఏఈ శివప్రసాద్‌, సిబ్బంది, మండలంలోని ప్రజాప్రతినిధులు, అచ్చంపేట సర్పంచ్ అనసూయ సత్యనారాయణ, హసన్ పల్లి సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్, మాగి కమ్మర్ కత్త సాయిలు, నాయకులు, పర్యాటకులు పాల్గొన్నారు.

Also Read : Singur Dam : నీటితో కళకళలాడుతున్న సింగూరు ప్రాజెక్టు..

Advertisement

Next Story

Most Viewed