నిజాంసాగర్ కాలువ ఇలా... కాలువలో నీరు పోయేది ఎలా.. ?

by Aamani |
నిజాంసాగర్ కాలువ ఇలా... కాలువలో నీరు పోయేది ఎలా.. ?
X

దిశ,ఆర్మూర్ : ఒకప్పటి ఇందూరు వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు ను నిజాం నవాబులు వారి పాలనలో నిర్మించి రైతులకు కాలువలు ఏర్పాటు చేసి నీటిని అందించారు. ఇప్పటికీ నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్ కాలువలతో దిగువన గల అన్ని ప్రాంతాల్లోని చెరువులకు నీటిని అందిస్తున్నది అందరికీ తెలిసిందే. ఈ రబీ సీజన్లో ప్రజల పశువులకు నీటిని అందించడానికి, రైతుల పంట పొలాలకు నీళ్లు అందించడం కోసం ప్రాజెక్టు ద్వారా నీటిని పంపుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం లోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల 82-2 నిజాంసాగర్ ప్రధాన కాలువ కట్ట తెగిపోయి గండిపడి ప్రక్కన గల జర్నలిస్ట్ కాలనీలో గల ఇండ్లలోకి ప్రవేశించి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి.

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రం గుండా వెళ్లే 82-2 నంబరు గల నిజాంసాగర్ ప్రధాన కాలువ హిస్టారీతిన ఏపుగా పెరిగిన తుమ్మ చెట్లతో, ముండ్ల పొదలతో అడవి ని తలపించేలా తయారైంది. ప్రభుత్వం రైతులకు వేసవి దృశ్య భూగర్భ జలాలు తగ్గకుండా చెరువుల్లోకి నీళ్లలో నింపాలన్న ఉద్దేశంతో నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని అందిస్తుంటే సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు ఆ ప్రాజెక్టుకు చెందిన ఇరిగేషన్ కెనాలను పరి శుభ్రపరచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఆర్మూర్లో గుప్పుమంటున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ ప్రధాన కాలువలను ఓసారి పరిశీలిస్తే ఇవి కాలువల అడవిలో తలపించే దట్టమైన ముండ్ల బోధలతో నీటిని సైతం కిందికి వెళ్లకుండా తయారయ్యాయని రాజకీయ ప్రముఖులు విశ్వయం వ్యక్తం చేస్తున్నారు.

కానీ ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం ప్రతి సంవత్సరం నిజాంసాగర్ కెనాళ్లను పరిశుభ్రం చేస్తున్నామని చెప్పడాన్ని చూస్తుంటే .. ఆర్మూర్ ప్రాంత ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గల నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలను ఓసారి పరిశీలిస్తే ఆ కాలువల పరిశుభ్రత ఏ తీరుగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దట్టమైన చెట్లతో, ముళ్ళ పొదలతో చెత్తాచెదారాలు ఆ చెట్లకు అడ్డుగా తట్టుకొని నీటి ప్రవాహాన్ని సైతం అడ్డుకోవడంతోనే సోమవారం ఉదయం ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో నిజాంసాగర్ ప్రధాన కాలువ కట్ట తెగిపోయిందని జర్నలిస్ట్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇందూరు జిల్లాలోని ఇరిగేషన్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆర్మూర్ ప్రాంతం తో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో గల నిజాంసాగర్ అన్ని ప్రధాన కాలువలను పరిశుభ్ర చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story