రూరల్ ఎమ్మెల్యే దిష్టి బొమ్మను దహనం చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు

by Sumithra |
రూరల్ ఎమ్మెల్యే దిష్టి బొమ్మను దహనం చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలంలోని పాకాల గ్రామంలో ఆదివారం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దిష్టి బొమ్మను దహనం చేశారు. చాలసార్లు తమ గ్రామ సమస్యలు పరిష్కారం చేయ్యాలని రూరల్ ఎమ్మెల్యేను విన్నవించినప్పటికి, సమస్యలు అలానే వున్నాయని రెండు సార్లు గెలిపించిన ఒకసారి కూడ తమగ్రామానికి ధరించలేదని నిరసిస్తూ స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు. టీఆర్ఎస్ వార్డ్ మెంబర్ బాదావత్ గంగాధర్, యూత్ ప్రెసిడెంట్ బానోత్ రమేష్ లు కలిసి ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఎన్నో త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం ఇటువంటి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకు రూరల్ నియోజక వర్గంలోనే చివరి మారుమూల గ్రామమైన పాకాల కొన్ని ఏళ్లు తరబడి అనేక సమస్యలతో సతమతమవుతున్నామన్నారు. గ్రామ ప్రజలకు త్రాగు నీటి సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదని, ప్రభుత్వ పాఠశాలలో ఒకరే ఉపాధ్యాయుడు వుండడం, గ్రామానికి విద్యుత్ సౌకర్యం సరిగ్గా కల్పించక పోవడం లేదని, రవాణాకు బస్సులు లేవని, ముఖ్యంగా వైద్య సదుపాయం లేకపోవడం, టెలిఫోన్ సిగ్నల్ సౌకర్యం అందుబాటులో లేక సెల్ ఫోన్ మోరాయింపు, వంటి అవస్థాపన మండల కేంద్రానికి దూరంగా ఉండడం, అనేక సమస్యలు తీర్చాలని పలుమార్లు విన్నవించిన పరిష్కరించకపోవడంతో విసుగు చెంది ఎమ్మెల్యే దిష్టి బొమ్మ దహనం చేసినట్లు వారు తెలిపారు.

ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల్లో గెలిచిన నాయకులు ఈ గ్రామం వైపు చూడడం లేదు ఎన్నిసార్లు దరఖాస్తులు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ పథకాలు చూపించి ఇంతవరకు తమ గ్రామంలో అభివృద్ధి పనులు కూడ చేయడం లేదని విసుగు చెందిన యువకులు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ దిష్టిబొమ్మను దహనకార్యక్రమం చేశామని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమను పట్టించుకోని వారి గ్రామ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వార్డ్ మెంబర్ బాదావత్ గంగాధర్, టీఆర్ఎస్ కార్యకర్తలు బానోత్ రమేష్, బుక్యా అశోక్, మూడ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed