- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వీల్ చైర్ పై వాటర్ బబుల్.. పైదల్ తో పేషంట్లు..
దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ ప్రభుత్వ దవఖానలో నిరంతరం వైద్యం అందిస్తూ రాష్ట్రస్థాయిలో అవార్డులు పొందుతుంటే. మరో వైపు క్రింది స్థాయి సిబ్బంది మాత్రం పేషేంట్ లను పట్టించుచుకోవడం లేదు. రెండు సార్లు అపరేషన్ అయ్యి నడవలేని స్థితిలో ఉన్న 10 ఏళ్ల బాలుణ్ణి తల్లిదండ్రులు నడిపిస్తూ తీసుకెళ్తుంటే, మరో వైపు పక్కనే వాటర్ బబుల్ ను వీల్ చైర్ లో తీసుకెళ్లిన సంఘటన ప్రభుత్వ హాస్పత్రిలో గురువారం జరిగింది. ప్రభుత్వం పేదోనికి వైద్యం అందించాలని సంకల్పంతో ఆసుపత్రులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినా, కిందిస్థాయి సిబ్బంది మాత్రం పేషెంట్లను పట్టించుకోకపోవడం నిదర్శనంగా కనిపిస్తుంది.
మొన్నటికి మొన్న స్టెచర్ లేక ఓ పేషెంట్ ను తల్లిదండ్రులు ఈడ్చుకు పోయిన ఘటన మరువక ముందే ఇలా వీల్ చైర్ లో వాటర్ బాటిల్ తీసుకెళ్లిన సంఘటన చూస్తుంటే నిర్లక్ష్యం ఎంతగా ఉందో అర్థమవుతుంది. సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ ఎంత పర్యవేక్షణ చేసినప్పటికీ ఇలాంటి సంఘటనలు పునరావృత్తం అవుతూనే ఉన్నాయి. కింది స్థాయి సిబ్బందిలో ఎపుడు మార్పు వస్తుందో చూడాలి.