కేసీఆర్‌ బొమ్మకు గాజులు తొడిగి, చీర కట్టి నిరసన

by Disha News Web Desk |
కేసీఆర్‌ బొమ్మకు గాజులు తొడిగి, చీర కట్టి నిరసన
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఆర్మూర్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మకు చీర కట్టి, గాజులు తొడిగి నిరసన తెలిపారు. మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్‌ఎస్‌పీ నియోజకవర్గ ఇన్‌చార్జి మైలారం బాలు మాట్లాడుతూ.. కేసీఆర్ దళిత ద్రోహి అని, గతంలోనే దళితులను మోసం చేసిన కేసీఆర్ ఇప్పుడు రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. గతంలో దళిత ముఖ్యమంత్రి విషయంలో ఒకసారి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపు విషయంలో రెండోసారి, మూడెకరాల భూమి విషయంలో మూడోసారి దళితులను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి, తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడటానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని అన్నారు. ముందు కేసీఆర్ ఆర్టికల్ 3 గురించి తెలుసుకోవాలని సూచించారు. దొర అనే అహంకారంతోనే ఇలా మాట్లాడారని, తక్షణమే కేసీఆర్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇందారపు రాజు, విప్లవ్, రజాక్, ప్రగతి, అశోక్, అరవింద్, మాధవ్, చందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story