ఐమాక్స్ లైట్లు ప్రారంభించిన ఎంపీపీ..

by Sumithra |   ( Updated:2023-02-18 16:24:01.0  )
ఐమాక్స్ లైట్లు ప్రారంభించిన ఎంపీపీ..
X

దిశ, మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల పరిధి పేట గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు దంపతులు నాలుగు చోట్ల ఐమాక్స్ లైట్లను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పరిధి పేట గ్రామంలో యువత క్రీడలకు ఇబ్బందిగా ఉండడం వలన హై స్కూల్ గ్రౌండ్లో అడగగానే ఐమాక్స్ లైట్స్ ను ఆ గ్రామ ఎంపీటీసీ, మండల వైస్ ప్రెసిడెంట్ జీడిపల్లి నరసింహారెడ్డి ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు టీ.రాజిరెడ్డి, దీపక్ గౌడ్, శివయ్య, మాజీ ఉపసర్పంచ్, బట్ట వెంకట రాములు, రైతు సమన్వయ ఉపాధ్యక్షుడు కోల నర్సా గౌడ్, కొండల్ రెడ్డి, కటికి రాజు, వై గంగారెడ్డి, కోల బాలా గౌడ్, టి రామ్ రెడ్డి, వై నాగరాజ్ మరియు వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Advertisement

Next Story