సొంత పార్టీకే ఎంపీ సూటి ప్రశ్న

by Naveena |   ( Updated:2024-10-15 12:45:21.0  )
సొంత పార్టీకే ఎంపీ సూటి ప్రశ్న
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: బీజేపీ పార్టీకి ఎంపీ అర్వింద్ ధర్మపురి సూటి ప్రశ్న వేశారు.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 48 డివిజన్లు గెలుచుకున్న బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటును ఎందుకు గెలుచుకోలేకపోయిందని ప్రశ్నించారు. దీనిపై బీజేపీ ఒక్కసారి ఆలోచించుకోవాల్సి ఉందని ఎంపీ అర్వింద్ కామెంట్ చేయడమే కాకుండా.. ఈ పరిస్థితికి బాధ్యులెవరో కూడా తెలుసుకోవాలన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో రైల్వే ఓవర్ బ్రిడ్జిలపై మంగళవారం అధికారులతో రివ్యూ మీటింగ్ పూర్తి చేసుకున్న ఎంపీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన వారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయడం లేదో పార్టీ ఆలోచించుకోవాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్న బీజేపీ ఎనిమిది సీట్లు మాత్రమే గెలుచుకుని ఎందుకు వెనక పడిపోయిందో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. లోపాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ పార్టీ ఎందుకు అధికారంలోకి రావడం లేదో.. ఆలోచించే పనిలో పార్టీ ఉండాలని ఎంపీ ఒకింత ఘాటుగా, సూటిగా పార్టీ అధినాయకత్వానికి సూచించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందని, మొన్న విగ్రహాల ధ్వంసం ఘటనలో ఏం జరిగిందని ప్రశ్నించారు. కొద్ది రోజుల క్రితం కూడా తెలంగాణాలో పార్టీని గెలిపించి అధికారం లోకి తెగలిగే సత్తా ఉన్నోడే పార్టీ ప్రెసిడెంట్ గా ఉండాలని హాట్ కామెంట్ చేశాడు. తాజాగా మరోసారి ఆర్వింద్ చేసిన కామెంట్లు రాజకీయంగా చర్చనీయాంశం కాగా, సొంత పార్టీలో కాక పుట్టిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed