- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాత శిశువులకు ఆధునిక వైద్యం అవసరమే: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
దిశ బాన్స్వాడ : ప్రస్తుత సమాజంలో మాత శిశువులకు ఆధునిక వైద్యం అవసరమని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్స్వాడ పట్టణంలోని మాత-శిశు ఆసుపత్రిలో (MCH) నూతనంగా ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ మిషన్ ను శనివారం ఆయన ప్రారభించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ 'ఈ ఆధునిక స్కానింగ్ యంత్రం గర్భంలోని శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. బాన్సువాడ MCH లో నెలకు 350 వరకు ప్రసవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో 60 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతాయన్నారు. MCH బాన్సువాడ నియోజకవర్గంతో పాటుగా జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగంగా ఉందన్నారు. మౌళిక సదుపాయాలు పెంచడం, ఆధునిక పరికరాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలలో డెలివరీల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తీసుకురావడానికి అమ్మ ఒడి వాహనం 102 అందుబాటులో ఉంటుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం అందిస్తుండడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండి సాధారణ ప్రసవాలు పెరిగాయి. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి లక్ష్మన్ సింగ్, ఏరియా దవాఖాన సూపరెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.