మొక్కజొన్న పంటలపై వానరాల దాడి..

by Prasanna |
మొక్కజొన్న పంటలపై వానరాల దాడి..
X

దిశ, తాడ్వాయి : వానరసైన్యం రైతన్నల పాలిట శాపంగా మారింది.కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలంలోని అర్గోoడ గ్రామా శివారులో వందలాది కోతులు గుంపుగా సంచరిస్తూ చేతికొచ్చిన మొక్కజొన్న పంట పై దాడి చేస్తుండటంతో రైతన్నలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో పంటను రక్షించుకునేందుకు రైతన్నలు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు నకిలీ విత్తనాలు మరోవైపు భారీ వర్షాల దాటికి ఇంకోవైపు అటవీ పందులు ఇప్పుడే కోతుల బేడాతో రైతులను పీకల్లోతూ నష్టాలల్లో నెట్టేస్తుంది. పంటను రక్షించుకునేందుకు టపాకాయలు పెల్చిన ఇంకా వినూత్న ప్రయత్నం చేసిన అ కొద్దీ సమయం మాత్రమే ఊరట లభిస్తున్న ఆశించిన ఫలితం కానరావడం లేదు. అటవీ ప్రాంతంలో పండ్ల చెట్లు లేకపోవడంతో గుంపులుగా కోతులు వస్తున్నాయి. ఇల్లు, పంటపొలాలు అనే తేడా లేకుండా చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో గ్రామాల్లో కోతుల బెడద తీవ్ర సమస్యగా మారడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

పంట పొలాల్లో దాడి చెయ్యడంతో రైతన్నలు బెంబేలు

పల్లెల్లోనూ కోతుల బెడద నా నాటికీ పెరుగుతోంది. అడవులను విడిచి పల్లెల్లోకి అవి ప్రవేశిస్తున్నాయి. పల్లెలను వాటి జీవన ఆవాసాలుగా మార్చుకుంటున్నా యి. ఆకలితో అలమటిస్తూ ఊళ్లల్లో ప్రజలపై దాడులు చేస్తున్నాయి. జనాల చేతుల్లో ఏదైనా కనిపిస్తే వాటిని లాక్కునే సమయంలో కోతులు తీవ్రంగా గాయపరుస్తున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పంటపొలాలను, మొక్కజొన్న పంటలను తీవ్ర నష్టానికి గురి చేస్తున్నాయి ఇంకా పండ్ల తోటలనూ కూడా నాశనం చేస్తున్నాయి. కోతులపై ప్రజల్లో కొంత ఆధ్యాత్మిక భావన ఉండటంతో వాటిని ఏమీ చేయలేకపోతున్నారు.

ఫలితం లేకుండా పోయింది

రాజంపేట మండలం అర్గోoడ, బస్వాన్నపల్లి గ్రామ శివారులో పలువురు రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. అయితే, సుమారు 100 కు పైగా కోతులు పంటలపై దాడి చేస్తూ.. చేతికొచ్చిన పదిహేను ఎకరాల మొక్కజొన్న పంటను నాశనం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానరాల బెడద నుంచి తప్పించుకునేందుకు గతంలో కూరగాయలు సాగు చేసిన రైతులు.. ఈసారి మొక్కజొన్న పంట సాగుచేసినా కోతుల బెడద తప్పడం లేదంటున్నారు. పంటకు నీరు పెట్టడానికి వచ్చే సమయంలో ఒకరిద్దరు రైతులు ఉంటే కోతులు మాపై దాడి చేస్తున్నాయని భయాందోళన చెందుతున్నారు.

కోతుల బెడద నుంచి ప్రభుత్వమే విముక్తి కల్పించాలి

పంట చేతికొచ్చే సమయంలో విరిగిపడిన మొక్కజొన్న పైర్లు చూసి రైతులు తలలు పట్టుకుంటున్నారు వారికీ ఏం చేయాలో అర్థం కాక ఆవేదన చెందుతున్నారు. కోతులతో ప్రతిసారి పెద్ద ఎత్తున పంట నష్టం జరుగుతోందని.. ప్రభుత్వం స్పందించి తమకు కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story