కేంద్రం నిధులు ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీలో మోడీ ఫోటో పెట్టాలి.. దన్ పాల్ సూర్యనారాయణ

by Sumithra |
కేంద్రం నిధులు ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీలో మోడీ ఫోటో పెట్టాలి.. దన్ పాల్ సూర్యనారాయణ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాదు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్బంగా అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకాన్ని స్వాగత్తిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్య శ్రీని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ బారిన ఆదుకొని ఉంటే ఎంతో మందికి ఒక ఆశ్రయం కల్పించినట్టు ఉంటుండే కానీ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కారని అన్నారు. అయినా కేంద్రం ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అమలు చేసి ఇక్కడ కూడా అమలు చేయాలని ఎన్నిసార్లు కోరిన ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోలేదని ఒకవేల పట్టించుకోని ఉంటే ఆ రోజు కోవిడ్ కే కాకుండా మిగితా వ్యాధులకు ఉపయోగపడుతుందే అటువంటి తప్పులను ఈ ప్రభుత్వం చెయ్యవద్దని కోరారు. చాలా మందికి ఒక విషయం తెలవదు కేంద్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంకు 60%నిధులు అందచేస్తుంది.

రాష్ట్రప్రభుత్వం 40% నిధులు ఇచ్చి రాజీవ్ ఆరోగ్య శ్రీ పేరు పెట్టారన్నారు. కానీ కేంద్రం ప్రభుత్వం ఈ పథకం కింద 60 % నిధులు ఇస్తే ఆరోగ్య శ్రీ మీద నరేంద్ర మోదీ ఫోటో పెట్టకపోవడం బాధాకరం విచారకరం అన్నారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరవృతం కాకుండ చూసుకోవలని అధికారులను కోరారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నోసంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ పేదలను కాపాడుకుంటుంది అన్నారు. ఇక్కడ మాత్రం పేర్లు మార్చి పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం అయినా పేదల కోసం పని చేయాలనీ అన్నారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రాలు, అభివృద్ధి జరుగుతాయి అని అన్నారు. అధికారులు వెంటనే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి నరేంద్ర మోదీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కేంద్రం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారం అవసరం ఉన్న నా వంతుగా కృషి చేస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ ఓ సుదర్శన్, డిప్యూటీ సూపరిడెంట్ బాలరాజ్, డాక్టర్స్, నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story