- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజల ఆరోగ్యానికి రక్షణ..వంద పడకల దవాఖాన..
దిశ, ఆర్మూర్ : ప్రజల ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ ఆర్మూర్ వంద పడకల దవాఖాన అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ ఆసుపత్రిలో శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్మూర్ ఆసుపత్రి ద్వారా ఆధునిక వైద్యసేవలు అందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ కరుణతోనే ప్రజలకు వైద్యం చేరువైందన్నారు. కేసీఆర్ దయతోనే ఆర్మూర్ వందపడకల ఆసుపత్రిగా మారిందని, కేసీఆర్ 2014 జూన్ లో ఆర్మూర్ పర్యటనకు వచ్చిన సందర్భంగా తెలంగాణ స్వరాష్ట్రమైన తరువాత మొట్టమొదటి వందపడకల ఆసుపత్రిగా ఆర్మూర్ ను ప్రకటించారన్నారు.
ఇక్కడ ఇప్పటికే 25వేలకు పైగా ఉచిత ప్రసవాలు జరిగి ఒక్కో తల్లికి 50వేల రూపాయల చొప్పున ఖర్చు తప్పిందన్నారు. మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఎక్కడా లేవని, మహిళలకు అన్నిదశల్లో అన్నలా, మేనమామలా, తాతలా అండగా నిలుస్తున్న కేసీఆర్ దార్శనికుడైన పాలకుడు అన్నారు. కేసీఆర్ కిట్ అంటే ప్రసవ సమయంలో ఇచ్చి చేతులు దులుపుకునేది కాదని, తల్లికి చీరె, పుట్టిన బిడ్డకు బట్టలు, పిల్లల కోసం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఆరోగ్య సామాగ్రి, ఆట వస్తువులు, దోమ తెర వంటి వాటితో శిశు రక్షణకు ఇస్తున్నదే కేసీఆర్ కిట్ అన్నారు. 6నెలల గర్భవతి నుంచి 3నెలల బాలింత వరకు ఆమెకు ఆర్దికంగా అండగా ఉండేందుకు 12 వేల రూపాయలు ఇస్తుందన్నారు.
ఆడపిల్ల పుడితే అదనంగా 1000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వ మీది అన్నారు. ఆర్మూర్ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కిడ్నీ పేషెంట్లకు వరమన్నారు. ఆర్మూర్ ఆసుపత్రిలో రోజుకు 15 మందికి డయాలసిస్ సేవలు లభిస్తున్నాయన్నారు. ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఆర్మూర్ నియోజకవర్గం వేగంగా అడుగులేస్తోందని జీవన్ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ 27కోట్ల రూపాయలు మంజూరు చేసి నిర్మించిన నూరు పడకల ఆర్మూర్ దవాఖాన ద్వారా ప్రజలకు ఆధునిక వైద్యం బాగా చేరువై నిజామాబాద్ కో, హైదరాబాద్ కో వెళ్లాల్సిన బాధ చాలా వరకు తగ్గిందన్నారు.
గతంలో ఏ చిన్న వైద్య పరీక్షలకైనా నిజామాబాద్ కో, హైదరాబాద్ కో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు ఆర్మూర్ వంద పడకల ఆసుపత్రిలోనే నిర్వహించి వెంటనే రిపోర్టులు చేతిలో పెడుతుండడంతో ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న 25 వేల మందికి పైగా బాధితులు పెద్దాసుపత్రులలో వైద్యం చేయించుకోవడం వ్యాధి తీవ్రతనుబట్టి 20వేల నుంచి రూ. 20 లక్షల వరకూ సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీ చెక్కులను అందించి వారిని ఆదుకోవడానికి పెద్ద దిక్కులా నడిచా అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్, వైస్ చైర్మన్ షేక్ మున్న, ఎంపీపీ పస్కా నరసయ్య, జెడ్పీటీసీ మెట్టు సంతోష్, సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, నాయకులు పండిత్ ప్రేమ్, సుక్కి సుధాకర్, సుంకరి రంగన్న, గోవింద్ పెట్ ఈ.గంగాధర్, రింగుల భూషణ్, పోల సుధాకర్, జనార్దన్ గౌడ్, కొంగి సదాశివ్ పాల్గొన్నారు. అనంతరం ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలం మారంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాదె పెళ్లి గంగారెడ్డి సతీమణి గాదపెల్లి ముత్తవ్వ మరణించడంతో శనివారం ఆమె అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓదార్చారు.