- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదవ తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య.. బాజిరెడ్డి గోవర్ధన్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఐదవ తరగతిలో చేరితే డిగ్రీ, పీజీ వరకు ఉచిత విద్య విద్యార్థులకు గురుకులాల్లో అందుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గురుకులాల్లో పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు తెలంగాణ అమ్మాయిలు చేరాలని, దేశ సగటు కంటే మహిళా విద్యలో మనమే భేష్ అని అన్నారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యూకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మోపాల్ మండలం కంజర గ్రామంలో గల స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ 8 వ జోనల్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ హాజరై డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం జాతీయ జెండాను ఎగరవేశారు, బాలికలు చేసిన మార్చ్ ఫస్ట్, నృ త్యాలను ఎమ్మెల్యే వీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనునది స్కూల్ ఎడ్యుకేషన్లో భాగమే కాకుండా చాలా ప్రాముఖ్యమైనదని అన్నారు. అందుకే విద్యార్థి దశనుండే పిల్లలకు ఆటపై మక్కువ ఎక్కువగా ఉండాలని ఇంతే కాకుండా ఆటలు ఆడించడం వల్ల విద్యార్థులు మానసికంగా దృఢంగా అవడమే గాక ఉల్లాసంగా ఉండి ఉత్తేజంగా, చురుకుగా చదువుతోపాటు అని రంగాలలో రాణించటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు. దేశానికే దిక్సూచి
గ్రామీణ పేద ప్రతిభ గల విద్యార్ధులకు ఉచిత నాణ్యమైన విద్యనందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పిన గురుకులాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయి. మరే రాష్ట్రంలో లేనట్లుగా విజయపథాన సాగుతున్నాయి. అనతి కాలంలోనే మన గురుకులాలు విశిష్టమైన పాఠశాలలుగా నిలిచాయి. ఫలితాల సాధనలో అగ్రగామిగా నిలుస్తున్నాయి. వీటిల్లోని పేద విద్యార్ధులు దేశ విదేశాల్లో టెక్నోక్రాట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, బ్యూరోక్రాట్లుగా సేవలందిస్తున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న గురుకుల విద్యావ్యవస్థపై అధ్యయనానికి పలు రాష్ర్టాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ఇతర జిల్లాల నుండి వచ్చిన జట్లకు, మరియు ఇక్కడున్న క్రీడాకారులందరికి స్వాగతం తెలుపుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడుతుంది గెలవడం ఓడడం అనేది సహజం ఇక్కడున్న బాలికలందరూ నాకు మనుమరాళ్లతో సమానం.
ఒకప్పుడు నేను కూడా స్పోర్ట్స్ మెన్, క్రీడలు అంటే నాకు చాలా ఇష్టం, బాలికలందరికీ ధన్యవాదాలు అని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి పై రూ. 1,50,000 రూపాయలు గురుకుల పాఠశాలలో వేచిస్తుంది, విద్యార్థులందరూ గమనించలన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకొని దేశానికి , దేశ ప్రజలకి మంచి చేయాలని విద్యార్థులకు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎంపీపీ శ్రీ లతా , స్థానిక జడ్పిటిసి కమల , స్థానిక ప్రిన్సిపల్ మాధవి లతా మేడం , వైస్ ఎంపీపీ అనిత ప్రతాప్ సింగ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోర్చ శ్రీనివాస్, ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, రైతు సమన్వయ సమితి శ్రీనివాసరావు, స్థానిక సర్పంచ్ భరత్ కుమార్, ఎంపీటీసీ శ్రావణ్ కుమార్, కంజర వార్డ్ నెంబర్ 10, రాములు, మోపాల్ మండల సర్పంచ్ రవి, నరసింగ్ పల్లి సర్పంచ్ సాయి రెడ్డి, ఆర్సీఓ మేరీ ఏసు పాదం, ఇతర జిల్లాల నుండి వచ్చిన ఆర్సీఓలు, మోపాల్ మండలానికి చెందిన స్థానిక సర్పంచులు ఉపసర్పంచులు ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, విద్యార్థులు, క్రీడాకారులు, ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.