- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుజరాత్ మోడల్ కావాలా ? తెలంగాణ మోడల్ కావాలా : ఎమ్మెల్యే పీయూసీ చైర్మెన్ జీవన్ రెడ్డి
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోకి నూతనంగా ఏర్పడ్డ ఆలూరు మండల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పీయూసీ చైర్మెన్ జీవన్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసారు. గ్రామ శివారు ఆరంభంలోనే ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టపాసులు, డప్పు చప్పులతో, మహిళలు మంగళ హారతులతో బతుకమ్మలతో స్వాగతం పలికారు. రోడ్ కి ఇరువైపులా ప్రజలు జీవన్ రెడ్డి భారీ స్వాగత ర్యాలీని వీక్షించారు. అనంతరం నూతన ఎమ్మార్వో కార్యాలయం ప్రారంభించి అక్కడ ఉన్న సిబ్బందికి, ఎమ్మెర్వో కి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం విలీనమైన పది గ్రామాల నుండి వచ్చిన ప్రజలను ఉద్దేశించి సభ ప్రాంగణం వద్ద ఆయన ప్రసంగించారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనుల గురించి ఆయన వివరించారు. గుజరాత్ మెడల్ కావాలా ? తెలంగాణ మోడల్ కావాలా? అని ప్రజల్ని అడగగా కేసీఆర్ మోడలే కావాలి అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చప్పట్ల ద్వారా సంగిభావం తెలిపారు. అనంతరం 10 గ్రామాల వీడీసీ సభ్యులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని సన్మానించారు. ఉదయం 10 గ్రామాలకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వయంగా ఊరిదేవతలకు మేకలు పంపించి వీడీసీ నాయకులతో పూజలు చేయించారు.
అనంతరం వాటితో ఏర్పాటు చేసిన విందుకి విచ్చేసిన ప్రజలందరూ భోజనం చేసి వెళ్లాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం చేస్తున్న సంక్షేమం ప్రజలకు తెలుసు కాబట్టి మళ్ళీ బీఆర్ ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ఎమ్మెల్యే ఆలూరు మండల ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వీడిసి సభ్యులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, మహిళ సంఘాల సభ్యులు ఐకెపీ సిబ్బంది పాల్గొన్నారు.