- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని జాంబీ హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన దసరా ఉత్సవాలలో ఎమ్మెల్యే, పీయూసీ చైర్మెన్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి, ఆయన సతీమణి రజిత రెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొని జ్యోతి వెలిగించి దసరా ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలను ఆలయకమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రావణదహనం చేసి విజయదశమి రోజు అందరూ నూతన వస్త్రాలను ధరించి ఉత్సవాలలో పాల్గోన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీ ప్రకారంగా జాంబీహనుమాన్ దేవాలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో క్షమీవృక్షానికి పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ పూజారులు పూజలు చేసి క్షమీచెట్టుకు ఆకులను ఒకరినొకరు ఇచ్చుకుని అలాయి బలాయి చేసుకున్నారు. దసరా పండుగకు ప్రతి సంత్సరం లాగే ఇప్పుడు కూడా జాంబీహానుమాన్ ఆలయ కమీటీ ఉత్సవాలను జరిపి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. మున్సిపల్ చైర్మెన్ పండిత్ వినిత పవన్, పండిత్, ప్రేమ్, వైస్ చైర్మన్ షేక్ మున్ను, జాంబీహనుమాన్ ఆలయ కమిటీ చైర్మెన్ దేవేందర్, ఆలయ కమిటీ, డైరెక్టర్లు మున్సిపల్ కాన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.