- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
కుళ్లిన కేకులు తిని పలువురికి అస్వస్థత
దిశ, ఆర్మూర్ టౌన్ : ఆర్మూర్ పట్టణం బాలాజీ పెట్రోల్ పంపు ఎదురుగా ఉన్న డాల్ఫిన్ బెంగళూర్ బేకరీలో కుళ్లిన కేకులు విక్రయించడంతో పలువురు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కుళ్లిన కేక్ లు విక్రయించడంతో దుకాణ యజమానికి వినియోగదారుడు వాటిని చూపించారు. అయినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి కి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి బేకరీ దుకాణాన్ని సీజ్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.
కుళ్లిన కేక్ తినడంతో బాధితులకు గొంతు నొప్పి రావడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. దీంతో ఆర్మూర్ ఇన్చార్జి కమిషనర్ భూమేశ్వర్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్ కు ఫిర్యాదు చేయడంతో బేకరీ దుకాణానికి వచ్చి కుళ్లిన కేకులను పరిశీలించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న బేకరీ దుకాణం యజమానిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. బేకరీ దుకాణాన్ని సీజ్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ అంశంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు.