కేంద్ర మంత్రి గడ్కరీకి ఘన స్వాగతం

by Sridhar Babu |
కేంద్ర మంత్రి గడ్కరీకి  ఘన స్వాగతం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పర్యటనకు విచ్చేసిన కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మంత్రి గురువారం మధ్యాహ్నం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్)కు చేరుకున్నారు.

హెలిప్యాడ్ వద్ద నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎఫ్ఓ వికాస్ మీనా, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బొకేలు అందించి సాదర స్వాగతం పలికారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రత్యేక కాన్వాయ్ లో కేంద్ర మంత్రి పాత కలెక్టరేట్ మైదానంలో జరిగే సభలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు.

Advertisement

Next Story