లక్షలాది మంది మరాఠీలు స్వచ్ఛందంగా కందార్ లోహ సభకు..

by Sumithra |   ( Updated:2023-03-22 15:11:31.0  )
లక్షలాది మంది మరాఠీలు స్వచ్ఛందంగా కందార్ లోహ సభకు..
X

దిశ, ఆర్మూర్ : అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిచి దేశానికి దిక్సూచిగా మారిన తెలంగాణ మోడల్ ను సంపూర్ణంగా అర్థం చేసుకున్న మహారాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ కి జై కొడుతున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకకై మరాఠీ సోదరులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాందార్ లోహ సభద్వారా తెలంగాణ మోడల్ ఆవిష్కృతమవుతుందని ఆయన పేర్కొన్నారు.

"అనితర సాధ్యమైన అభివృద్ధి, ప్రజాసంక్షేమమే తెలంగాణ మోడల్ కేసీఆర్ ది దేశానికి అన్నం పెట్టే మోడల్, మోడీది అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టే మోడల్ అన్నారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. మోడీ అంటే ఒక అమ్మకం. కేసీఆర్ ది ఇండియా యిజం. మోడీది ఈడీయిజం. బీజేపీ ఒక సెల్లర్ పార్టీ. కిసాన్ కిల్లర్ పార్టీ. బీఆర్ఎస్ ది రాజనీతి. బీజేపీది దమన నీతి. కాందార్ లోహ సభసక్సెస్ తో మోడి దిమ్మదిరగాలి. లక్ష మందికి పైగా మహారాష్ట్ర ప్రజలతో కాందార్ లోహ సభజరుగుతుంది. దేశ ప్రజలు ఇకనైనా ఆలోచించాలి. గ్రామగ్రామాన చర్చ జరగాలి. అందరికీ అన్నం పెట్టే కేసీఆర్ మోడల్ కావాలా ? దేశ ప్రజలకు సున్నం పెడుతున్న మోడీ గోల్ మాల్ మోడల్ కావాలా ?

ఎకరానికి 10వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించే రైతుబంధు కేసీఆర్ కావాలా? ఏ కారణంతోనైన రైతు మరణిస్తే 48 గంటలలోపు ఆ రైతు కుటుంబానికి 5లక్షల చొప్పున రైతుబీమా చెల్లించే కేసీఆర్ ధీమా కావాలా? రైతును అవమానపర్చే మోడీ అహంకారం కావాలా? ఆరు వందలకు మించి పెన్షన్లు ఇవ్వని గుజరాత్ బేరగాళ్ళ మోడల్ కావాలా? రూ. 2016, రూ.3016 పెన్షన్లు ఇస్తున్న కేసీఆర్ మోడల్ కావాలా?. మోటార్లకు మీటర్లు పెట్టే మోడీ కావాలా? 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న కేసీఆర్ కావాలా? దళిత బంధు ఇచ్చే కేసీఆర్ కావాలా? దళితులు అంటే గౌరవం లేని మోడీ కావాలా? ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీళ్లు సరఫరా చేస్తున్న కేసీఆర్ కావాలా? ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డీకి పావుశేరు అమ్ముతున్న బీజేపీ ఒక సెల్లర్ పార్టీ. కంట్రీ కిల్లర్ పార్టీ అన్నారు.

బీజేపీ అంటేనే గుజరాతీ గులాంల పార్టీ అన్నారు. ప్రధాని మోడీ ఒక అదానీ కోసం పనిచేస్తుండు అన్నారు. కేసీఆర్ దేశంలోని అందరి కోసం పనిచేస్తుండు, మహారాష్ట్ర దేశానికి శ్వాస, ఆర్థిక రాజధానిగా మహారాష్ట్ర దేశానికే గర్వకారణం అన్నారు. ఇలాంటి గొప్పరాష్ట్రం బీజేపీతో నష్టపోకూడదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ మహారాష్ట్రలోనూ అమలు కావాలన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కాందార్ లోహ సభవేదికపైనా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరడానికి వివిధ పార్టీల నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఆదర్శవంతమైన తెలంగాణ మోడల్ తమరాష్ట్రంలో కూడా అమలు జరగాలన్నది మహారాష్ట్ర ప్రజల మనోగతం అన్నారు.

తమ సంపూర్ణ మద్దతు తెలిపి తమజీవితాలలో వెలుగులు నింపాలని కొరడానికి కేసీఆర్ రాకకై మహారాష్ట్ర ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లకు స్థానిక ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. కేసీఆర్ కి ఘనస్వాగతం పలికేందుకు మరాఠీ సోదరులు రెడీగా ఉన్నారు అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్ష్ తివారి, మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదం బీఆర్ఎస్ నేతలు జాకీర్ చౌస్, హరిసింగ్ రాథోడ్, ప్రవీణ్, జితేవాడ్, సుధాకర్ చౌహన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story