ఆర్మూర్ లో పట్టుబడ్డ కిడ్నాపర్లు

by Sridhar Babu |
ఆర్మూర్ లో పట్టుబడ్డ కిడ్నాపర్లు
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని శాస్త్రి నగర్ లో ముగ్గురు చిన్నారులు నబీర్, రిజ్వాన్, వాలిక్ లు వాలీబాల్ ఆడుకుంటుండగా నవీపేట్, బాన్సువాడ ప్రాంతాలకు చెందిన గుర్తు తెలియని వ్యక్తులు వారిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. శాస్త్రి నగర్ కాలనీలోని వాలీబాల్ ఆడుకుంటుండగా చిన్నారులను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా కాలనీవాసులు, చుట్టు పక్కల వారు గమనించి కిడ్నాపర్లను పట్టుకున్నారు. కిడ్నాపర్లను పట్టుకున్న కాలనీవాసులు మొదట చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed