- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతు లేనిదే రాజ్యం లేదు.. పోచారం శ్రీనివాస్ రెడ్డి
దిశ, బీర్కూర్ : రైతు లేనిదే రాజ్యం లేదని రైతు కష్టపడి పంట పండిస్తేనే ధనవంతులైన లేనివాళ్ళైనా నాలుగు వేలు నోట్లోకి పోతాయని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలోని రైతు వేదికలలో రైతు దినోత్సవంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో రైతు దినోత్సవంలో భాగంగా ఎడ్లబండ్ల పై, ట్రాక్టర్లలో బైక్ లపై భారీ ర్యాలీలు నిర్వహించారు. సభాపతి ట్రాక్టర్ నడుపుతూ రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ దృశ్యాలు రైతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సభాపతి మాట్లాడుతూ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదొక పండుగని, కులాలకు, మతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే రైతు పండుగ ఇది అన్నారు. రైతులకు కులం, మతం, ప్రాంతం లేదన్నారు. రైతులు అమాయకులని, కష్టపడి పనిచేయడం తప్ప మోసం తెలియదన్నారు.
కోటీశ్వరుడు అయినా, పేదవారు అయినా రైతులు పండించిన ధాన్యాన్ని తింటేనే ఆకలి తీరుతుందన్నారు. గతంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై అరవై సంవత్సరాలు పోరాడిన ఫలితం రాలేదన్నారు. 1969 లో జరిగిన తొలి దశ పోరాటంలో నేను పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. ఇందిరాగాంధీకి లొంగిపోయి మర్రి చెన్నారెడ్డి ఉద్యమాన్ని నీరుగార్చారని స్పీకర్ ఆరోపించారు. 2001 లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన కేసీఆర్ విజయం సాధించేవరకు ఆపలేదని చెప్పారు. ఈ పోరాటంలో వందలాది మంది యువకులు, విద్యార్థులు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. అమరుల త్యాగాల ఫలితం, తెలంగాణ ప్రజల పోరాటం, కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు.
జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఈ చారిత్రక ప్రాధాన్యాన్ని అందరూ గుర్తుంచుకునే విదంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను జూన్ 22 వరకు ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. తొమ్మిది సంవత్సరాల ప్రగతి ని వివరించడానికి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమే ఉత్సవాలలో మొదటి రోజు రైతు దినోత్సవం అన్నారు. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారని, కానీ కరంటు, నీళ్ళు, మద్దతు ధరతో కొనుగోలు అనేవి రైతులకు అందుబాటులో లేవని చెప్పారు. సాగు పెట్టుబడుల కోసం ప్రవేటు వ్యాపారుల వద్థ అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకునే వాళ్ళమని, పండిన ధాన్యం వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసేవారని, అప్పుల వ్యవసాయం ఆనాటి పరిస్థితి అని అన్నారు.
రైతు బతకాలంటే కరంటు సరఫరా ఉండాలి, అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి. సాగునీరు అందాలి. పండిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలన్నారు. ఇవే రైతు కోరుకునేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత రైతులకు అవసరమైన వాటిని సమకూర్చారన్నారు 2014 లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,000 మెగావాట్లు అయితే నేడు 18,000 మెగావాట్ల కు పెరిగిందన్నారు.దేశంలో 24 గంటల నాణ్యమైన కరంటును వ్యవసాయానికి సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. సాగునీటి విడుదల కోసం గతంలో ధర్నాలు చేసేవాళ్ళం. లాఠీ దెబ్బలు తిన్నామని, నేడు రెండు పంటలకు డోకా లేకుండా పుష్కలంగా సాగునీరు అందుతుందన్నారు.
మూడు సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారన్నారు ఎరువులు, విత్తనాలను కొనుక్కోవడానికి రైతుబంధు ద్వారా సీజన్ కు ఎకరాకు అయిదువేల రూపాయలు ఇస్తున్నామన్నారు పండిన పంటలను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ కుటుంబానికి అండగా అయిదు లక్షల రూపాయలు రైతుబీమా నగధు అందుతుందనీ సభాపతి తెలిపారు. దేశంలో ఈ పనులను ఏ ముఖ్యమంత్రి చేయడం లేదని , ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కుర్చీల మీద ఉన్న ద్యాస రైతుల మీద లేదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలు రైతులు పాల్గొన్నారు.